లాక్‌డౌన్ సమయంలో కేటీఆర్ కొడుకు,కూతురు..ఆన్‌లైన్ స్కూల్

  • Published By: madhu ,Published On : March 28, 2020 / 11:56 AM IST
లాక్‌డౌన్ సమయంలో కేటీఆర్ కొడుకు,కూతురు..ఆన్‌లైన్ స్కూల్

కరోనా భయంతో భారతదేశం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. మొత్తం 21 రోజుల పాటు ఇది కొనసాగుతుందని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. దీంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. స్కూళ్లు, కాలేజీలు, కంపెనీలు, ప్రముఖ ఆఫీసులు, ఇతరత్రా మూతవేయబడ్డాయి. స్కూ    ళ్లకు సెలవులు కావడంతో ఇళ్లన్నీ పిల్లలతో సందడిగా మారిపోయాయి. కొంతమంది పుస్తకాలతో కాలక్షేపం చేస్తుంటారు.

మరికొంతమంది గేమ్స్ ఆడుతూ..ఆటలు ఆడుతూ..పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ క్షణం తీరిక లేకుండా..ఉండే..మంత్రి కేటీఆర్…కొడుకు..కుమార్తె ఏం చేస్తున్నారో తెలుసా ? ఆన్ లైన్ స్కూల్ తో బిజీ బిజీగా ఉన్నారు. 

మంత్రి కేటీఆర్..తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి. ఈయన సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటుంటారు. ఏదైనా సమస్య వస్తే..వెంటనే రెస్పాండ్ అవుతూ..వాటికి పరిష్కారం చూపించాల్సిందిగా ఆదేశాలిస్తుంటారు. ఇదిలా ఉంటే..2020, మార్చి 27వ తేదీ శుక్రవారం కేటీఆర్ చేసిన ట్వీట్ పలువురిని ఆకట్టుకుంది. 

ట్వీట్ లో కేటీఆర్ కూతురు, కొడుకు ఉన్నాడు. వీరిద్దరూ కంప్యూటర్, పుస్తకాలు ముందట వేసుకుని చదువుతూ కనిపించారు. పరీక్షా సమయంలో ఆన్ లైన్ స్కూలింగ్ జరుగుతోంది..నా కొడుకు, కూతురు వాళ్లవాళ్ల పనులు చేసుకుంటున్నారు..అంటూ ఫొటోలను జత చేశారు కేటీఆర్. దీనిపై నెటిజన్లు స్పందించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తే..బాగుండేదని వ్యాఖ్యానిస్తున్నారు.