ధైర్యవంతుడైన పైలట్ కోసం దేవుణ్ని ప్రార్థిస్తున్నా

  • Published By: venkaiahnaidu ,Published On : February 27, 2019 / 02:10 PM IST
ధైర్యవంతుడైన పైలట్ కోసం దేవుణ్ని ప్రార్థిస్తున్నా

జెనీవా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిదన్నారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. పాక్ దాడులను తిప్పికొట్టే క్రమంలో భారత పైలట్ పాక్ కి చిక్కి అక్కడి సైనికుల చేతుల్లో చిత్రహింసలకు గురైన ఘటనపై స్పందించిన అసదుద్దీన్.. ఈ కష్ట సమయంలో ధైర్యసాహసాలు కలిగిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్, అతడి కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. జెనీవా ఒప్పందంలోని ఆర్టికల్ 3కింద ఖైదీలను మానవత్వంతో చూడాలని పాక్ కు సూచించారు. రెండు దేశాల మధ్య  ఉద్రిక్త పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఐఏఎఫ్ పైలట్ విషయంలో పాక్ ఈ ఒప్పందాన్ని తప్పనిసరిగా గౌరవించాలని అన్నారు.
Also Read:  సర్జికల్ స్ట్రయిక్స్ – 2.0 స్పెషల్  స్టోరీస్

మంగళవారం(ఫిబ్రవరి-26,2019) పాక్ లోని బాలాకోట్ లోని జైషే మహమ్మద్ ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం(ఫిబ్రవరి-27,2019) ఎల్ వోసీ దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన పాక్ విమానాన్ని భారత్ కూల్చివేసింది.
Also Read:క్షేమంగా తిరిగి రావాలి : విక్రమ్ అభినందన్ ఎవరంటే..

భారత్ కు చెందిన రెండు యుద్ధ విమానాలను తాము కూల్చివేసినట్లు పాక్ ప్రకటించింది. ఈ సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత వాయుసేనకు చెందిన మిగ్-21 విమానాన్ని కూల్చివేశామని,పైలట్ విక్రమ్ అభినందన్ ను చిత్రహింసలు పెడుతున్న వీడియోను పాక్ విడుదల చేసింది.

Also Read:పాక్ కూల్చిన భారత యుద్ధ విమానాలు ఇవే