Over Steam: అతిగా ఆవిరి పడుతున్నారా? వేడి నీళ్లు తాగుతున్నారా? ప్రమాదమే.. క్యాన్సర్ వచ్చే చాన్స్..?

ప్రస్తుతం అందరికి కరోనా మహమ్మారి భయం పట్టుకుంది. కరోనా పేరు వింటే చాలు ఉలిక్కిపడుతున్నారు. ఏ ఇద్దరు కూర్చున్నా డిస్కషన్ దాని గురించే. అంతగా, ఈ మహమ్మారి ఆందోళనకు గురి చేస్తోంది. కాగా, కరోనా బారిన పడకుండా ఉండేందుకు కొందరు ఇంట్లో పలు చిట్కాలు పాటిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అందులో ముఖ్యమైనవి వేడి నీళ్లు తాగడం, ఆవిరి పట్టడం. వీటి వల్ల కరోనా రాకుండా ఉంటుందో లేదో తెలియదు కానీ.. అతిగా చేస్తే మాత్రం.. సమస్యలు తప్పవని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అతిగా వేడి నీళ్లు తాగడం, అతిగా ఆవిరి పట్టడం.. చాలా డేంజర్ అంటున్నారు.

Over Steam: అతిగా ఆవిరి పడుతున్నారా? వేడి నీళ్లు తాగుతున్నారా? ప్రమాదమే.. క్యాన్సర్ వచ్చే చాన్స్..?

Over Steam Inhalation

Over Steam Inhalation : ప్రస్తుతం అందరికి కరోనా మహమ్మారి భయం పట్టుకుంది. కరోనా పేరు వింటే చాలు ఉలిక్కిపడుతున్నారు. ఏ ఇద్దరు కూర్చున్నా డిస్కషన్ దాని గురించే. అంతగా, ఈ మహమ్మారి ఆందోళనకు గురి చేస్తోంది. కాగా, కరోనా బారిన పడకుండా ఉండేందుకు కొందరు ఇంట్లో పలు చిట్కాలు పాటిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అందులో ముఖ్యమైనవి వేడి నీళ్లు తాగడం, ఆవిరి పట్టడం. వీటి వల్ల కరోనా రాకుండా ఉంటుందో లేదో తెలియదు కానీ.. అతిగా చేస్తే మాత్రం.. సమస్యలు తప్పవని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అతిగా వేడి నీళ్లు తాగడం, అతిగా ఆవిరి పట్టడం.. చాలా డేంజర్ అంటున్నారు.

steaming

అసలు.. రోజుకు ఎన్నిసార్లు అవిరి పట్టాలి? ఏ సమయంలో ఆవిరి పట్టొచ్చు? అనే దానికి డాక్టర్లు ఏమంటున్నారంటే.. ముక్కు దిబ్బడగా ఉండి.. నోటి ద్వారా శ్వాస తీసుకునే పరిస్థితి ఉంటే రెండు రోజుల పాటు ఉదయం, సాయంత్రం ఆవిరి పట్టొచ్చన్నారు. అయితే నెలల తరబడి అలా చేయకూడదన్నారు. అలా చేస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందన్నారు. వేడి నీరు తాగడంపై కూడా అపోహలున్నాయి. నెలల తరబడి వేడి నీళ్లు తాగితే అల్సర్లు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆయాసం, కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తుతాయని వివరించారు. ఎక్కువ రోజులు, ఎక్కువ వేడి నీరు తాగితే అన్నవాహిక దెబ్బతిని క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. అనవసరమైన సమయంలో ఆవిరిపట్టడం, వేడి నీళ్లు తాగడం మానేయాలని డాక్టర్లు సూచించారు.

Does drinking warm water in summer help

వ్యాక్సిన్ వేసుకున్నాక ట్యాబ్లెట్లు తీసుకోకూడదా?
”ఇక వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత దీర్ఘకాలిక మందుల వాడకం మానివేయడం ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్‌ వేసుకున్నాక ఎలాంటి ట్యాబ్లెట్లు వాడొద్దనే అపోహ వీడాలి. టీకా వేసుకున్నాక చాలా మంది.. వారు వాడుతున్న షుగర్‌, బీపీ మాత్రలు కూడా వేసుకోవడం లేదు. ఎవరో చెప్తే వారు ఇలా చేస్తున్నారు. ఆరోగ్యంపై అశ్రద్ధ వహించొద్దు. వ్యాక్సిన్‌ తీసుకున్న రెండు రోజుల తర్వాత వారు ఎప్పుడూ వాడే మందులు వాడుకోవాలి. కొన్ని పెయిన్‌ కిల్లర్లను మాత్రమే వాడొద్దని వైద్యులు సూచిస్తున్నారు. వాటిని వేసుకోకుండా ఉంటే చాలు. టీకా తీసుకున్న చాలా మందికి కొన్ని గంటల తర్వాత జ్వరం వస్తోంది. ఒకటి, రెండు రోజుల వరకు మాత్రమే ఈ జ్వరం ఉండే అవకాశం ఉంటుంది. మూడు లేదా అంతకుమించి రోజులు జ్వరం, నీరసం, గొంతు నొప్పి, దగ్గు, ఒళ్లు నొప్పులు ఉంటే అవి వ్యాక్సిన్‌ వేసుకోవడం వల్ల కాదనే విషయాన్ని గుర్తించాలి. వాటిని కరోనా లక్షణాలుగా భావించి టెస్టు చేయించుకోవాలి” అని డాక్టర్లు చెబుతున్నారు.

జ్వరం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలుంటే వ్యాక్సిన్‌ వేసుకోవచ్చా? కొవిడ్‌ సోకితే ఎన్ని రోజులకు టీకా తీసుకోవాలి?
జ్వరం, ఇతరత్రా లక్షణాలు ఏమీ లేనప్పుడే వ్యాక్సిన్‌ వేసుకోవాలి. కరోనా సోకి ఉంటే అది తగ్గిన 8 వారాల తర్వాత మాత్రమే టీకా తీసుకోవాలి. మొదటి డోస్‌ తీసుకున్న తర్వాత కొవిడ్ బారిన పడితే.. పూర్తిగా కోలుకున్న అనంతరం రెండు వారాల తర్వాత మాత్రమే రెండో డోసు తీసుకోవాలి.

పిల్లలకు కొవిడ్‌ సోకిన తల్లులు పాలు ఇవ్వొచ్చా? ఒకవేళ ఇస్తే ఎలాంటి జాగ్రత్తలు వహించాలి?
కొవిడ్‌ సోకిన తల్లులు అన్ని నిబంధనలు పాటిస్తూ తమ పిల్లలకు పాలు అవ్వొచ్చు. ఎలాంటి ప్రమాదం లేదు. తల్లి పాల ద్వారా శిశువుకు కరోనా రాదు.