PM Modi In Telangana : తెలంగాణ ప్రజలకు మాట ఇస్తున్నా.. అవినీతి చేసేవారిని వదిలి పెట్టను : ప్రధాని మోడీ

తెలంగాణలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ బేగంపేటలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడేతూ..తెలంగాణ ప్రజలకు మాట ఇస్తున్నా.. అవినీతి చేసేవారిని వదిలి పెట్టను..అవినీతిపరులంతా ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. దోచుకున్న వాళ్లను విడిచిపెట్టే ప్రసక్తే లేదు అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు.

PM Modi In Telangana : తెలంగాణ ప్రజలకు మాట ఇస్తున్నా.. అవినీతి చేసేవారిని వదిలి పెట్టను : ప్రధాని మోడీ

Modi harshly criticized the TRS government

PM Modi In Telangana : ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగించుకుని ప్రధాని మోడీ తెలంగాణ వచ్చారు. బేగంపేట ఎయిర్ పోర్టులో ప్రధానికి గవర్నర్ తమిళిసై,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తనసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేపీ బేగంపేటలో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా నేను మాట ఇస్తున్నా..అవినీతికి పాల్పడేవారిని వదిలి పెట్టను అన్నారు. తెలంగాణలో ఏ ఉప ఎన్నిక జరిగినా బీజేపీ ఆదరిస్తున్నారని దీనికి కారణమైన కష్టపడే బీజేపీ కార్యకర్తలకు శుభాకాంక్షలు చెప్పటానికి వచ్చానని తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు పోరాట పటిమ కలవారని వారినుంచి నేను స్ఫూర్తి పొందుతున్నానంటూ కార్యకర్తల్లో జోష్ నింపారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టే ఇబ్బందులను తట్టుకుని బీజేపీ కార్యకర్తలు ముందుకే అడుగులు వేస్తున్నారని..అటువంటి కార్యకర్తలు బీజేపీకి మాత్రమే ఉంటారన్నారు.

మునుగోడు ఉప ఎన్నిక విషయంపై మాట్లాడుతూ..మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం దిగివచ్చిందని అన్నారు. తెలంగాణ అనే సెంటిమెంట్ ను అడ్డంపెట్టుకుని అధికారంలోకి వచ్చినవారు ముందుకెళుతుంటే తెలంగాణ ప్రజలు మాత్రం వెనుబడే ఉన్నారని తెలంగాణను వెనుకబాటుకు గురిచేస్తున్నారంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. తెలంగాణ ప్రజలు బీజేపీని బలపరుస్తున్నారని 1984లో బీజేపీ రెండు సీట్లు గెలుచుకుంటే అందులో ఒకసీటు హన్మకొండ రూపంలో వచ్చిందని ..ఆ స్ఫూర్తితోనే దేశ వ్యాప్తంగా బీజేపీ 300పైగా సీట్లు గెలుచుకుందని తెలిపారు. అటువంటి పోరాటంతో బీజేపీ కార్యకర్తలు ముందుకెళ్లాలని కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలని నేను కూడా మీలా ఓ సాధారణ కార్యకర్తనని ప్రధాని మోడీ తనదైన శైలిలో బీజేపీ కార్యకర్తల్లో జోష్ నింపారు.

తెలంగాణలో బీజేపీకి రెండూ మూడు సీట్లు కాదు మొత్తం సీట్లు బీజేపీకి దక్కాలని దాని కోసం కార్యకర్తలు కృషి చేయాలని..చేస్తారనే నమ్మకం నాకుంది అని అన్నారు. తెలంగాణలో బీజేపీ సంపూర్ణ విజయం సాధించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మూఢ విశ్వాసంలో మునిగిపోయిందంటూ విమర్శించారు. మూఢనమ్మకాలకు ఈ ప్రభుత్వం నాంది పలికింది అనా ఎవరు ఎక్కడుండాలి? మంత్రి మండలిలో ఎవరిని ఉంచాలనే మూఢనమ్మకాలతో ఈ ప్రభుత్వం పనిచేస్తోంది అంటూ విమర్శించారు.

అవినీతిపరులంతా ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. దోచుకున్న వాళ్లను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. విచారణల నుంచి బయటపడేందుకు కొంతమంది కూటములుగా ఏర్పడుతున్నారు.సామాన్యులకు సేవ చేయడానికి ఉన్నమార్గమే రాజకీయం. రాజకీయాలనేవి సేవాభావంతో ఉండాలి. కానీ ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్లు మోదీని తిట్టడం, బీజేపీని తూలనాడటమే పనిగా పెట్టుకున్నారు. మోదీని తిట్టేవాళ్ల గురించి మీరు పట్టించుకోవద్దు. వాళ్లకు నన్ను తిట్టడం తప్ప మరే పనిలేదు. 22ఏళ్లుగా నన్ను చాలా మంది తిడుతూనే ఉన్నారు. సాయంత్రం టీ తాగుతూ ఆ తిట్లను ఎంజాయ్ చేయండి అంటూ బీజేపీ శ్రేణులకు మోడీ సూచించారు.

ఈ నేల ఐటీ విప్లవానికి పురిటిగడ్డలాంటిది. కానీ ఇక్కడి ప్రభుత్వం మూఢ విశ్వాసంతో మునిగిపోయింది. మూఢ నమ్మకాలకు ఈ ప్రభుత్వం అగ్రస్థానం కల్పించింది అంటూ కేసీఆర్ ప్రభుత్వంపై మోదీ విమర్శలు గుప్పించారు. ఎక్కడ నివసించాలి.. ఎవరు మంత్రి మండలిలో ఉండాలి.. ఎవరిని ఉంచాలని మూఢ నమ్మకాలే నిర్ణయిస్తున్నాయి అంటూ కేసీఆర్ ప్రభుత్వంపై మోడీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఒక్క మునుగోడు ఎన్నికకోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దిగివచ్చింది. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీని బలపరుస్తూ వస్తున్నారు. తెలంగాణ ఎప్పుడూ బీజేపీని ఆదరిస్తూ వస్తోంది. 1984లో బీజేపీ రెండు సీట్లు గెలిస్తే అందులో ఒక సీటు హన్మకొండ రూపంలో తెలంగాణనే అందించింది. ఆ స్ఫూర్తితో దేశ వ్యాప్తంగా బీజేపీ 300పైగా సీట్లను గెలుచుకుంది. తెలంగాణలో కూడా బీజేపీ సంపూర్ణ విజయం సాధించాలి అని మోడీ అన్నారు.