Teacher Suicide : మరో విషాదం, ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేట్ స్కూల్ టీచర్ ఆత్మహత్య

కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. చాలామంది ఉపాధి కోల్పోయారు. ఆర్థిక ఇబ్బందులతో ఉసురు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్లలో పని చేసే టీచర్లపై కరోనా తీవ్రమైన ప్రభావం చూపింది. స్కూళ్లు మూతపడటంతో చాలామంది టీచర్లు, సిబ్బంది రోడ్డున పడ్డారు. ఉపాధి లేక, జీతాలు రాక ఎలా బతకాలో తెలీక సతమతం అయిపోతున్నారు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

Teacher Suicide : మరో విషాదం, ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేట్ స్కూల్ టీచర్ ఆత్మహత్య

Private School Teacher Suicide

Private School Teacher Suicide : కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. చాలామంది ఉపాధి కోల్పోయారు. ఆర్థిక ఇబ్బందులతో ఉసురు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్లలో పని చేసే టీచర్లపై కరోనా తీవ్రమైన ప్రభావం చూపింది. స్కూళ్లు మూతపడటంతో చాలామంది టీచర్లు, సిబ్బంది రోడ్డున పడ్డారు. ఉపాధి లేక, జీతాలు రాక ఎలా బతకాలో తెలీక సతమతం అయిపోతున్నారు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

తాజాగా.. ఉపాధి కోల్పోయి కలత చెందిన ఒక ప్రైవేట్ టీచర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన మామిడి రవివర్మరెడ్డి(30) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు స్కూల్ లో ఉపాధ్యాయుడిగా పని చేసే వాడు. కరోనాతో పాఠశాలలు మూసివేయడంతో ఉపాధి కోల్పోయాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. కుటుంబపోషణ భారంగా మారింది. ఈ క్రమంలో బుధవారం(మే 19,2021) హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి వచ్చిన రవిరవ్మ ఇంట్లోనే ఉరేసుకున్నాడు. రవివర్మకు భార్య, కొడుకు ఉన్నారు. రవివర్మ మృతితో ఆ కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ప్రైవేట్ స్కూల్ టీచర్ల కష్టాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది టీచర్లకు, సిబ్బందికి ఆర్థిక సాయం అందిస్తోంది. నెలకు రూ.2 వేల ఆర్థిక సాయంతో పాటు ఉచితంగా బియ్యం ఇస్తున్నారు.