Pudding and Mink: ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ కేసు: డ్రగ్స్ వాడిన వారిని గుర్తించేపనిలో పోలీసులు

ఈనేపధ్యంలో అసలు పబ్ లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయి? డ్రగ్స్ ఎవరు వాడారు? బర్త్ డే పార్టీ ఎవరిది ? వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Pudding and Mink: ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ కేసు: డ్రగ్స్ వాడిన వారిని గుర్తించేపనిలో పోలీసులు

Pub

Pudding and Mink: హైదరాబాద్ బంజారాహిల్స్ ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈఘటనలో ఇప్పటికే పబ్ మేనేజర్ అనిల్ సహా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఇప్పటికే నిందితుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్ పోలీసుల పిటిషన్‌ వేశారు. ఈనేపధ్యంలో అసలు పబ్ లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయి? డ్రగ్స్ ఎవరు వాడారు? బర్త్ డే పార్టీ ఎవరిది ? వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈవిషయంలో పబ్ మేనేజర్ అనిల్ కుమార్ ఇచ్చే వివరాలు కీలకంగా మారనున్నాయి. ఫోరెన్సిక్‌ మరియు సాంకేతిక ఆధారాలపైనా పోలీసుల దృష్టి సారిస్తున్నారు. ఈ కేసులో ఎన్డీపీఎస్‌ చట్టంలోని 8సీ, 22 బీ, 29 (1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. చట్ట ప్రకారం మాదకద్రవ్యాలు దొరికిన ప్రాంగణ యజమానులను నిందితులుగా మారనున్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది పబ్‌ను లీజుకు తీసుకున్న అభిషేక్, అర్జున్, కిరణ్‌లను నిందితులుగా చేర్చారు పోలీసులు.

Also read:No Trace of Fisherman: కాకినాడ తీరంలో సముద్రంలో వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు అదృశ్యం

అయితే పబ్ పై దాడి జరిగిన నాటి నుంచి అర్జున్ మరియు కిరణ్ రాజ్ లు పరారీలో ఉన్నారు. రెండు పోలీసు బృందాలు వీరిద్దరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా పబ్‌లోని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్న బంజారాహిల్స్ పోలీసులు..ఈ కేసులో అసలు సూత్రధారులతోపాటు మాదకద్రవ్యాలు వినియోగించిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. 50 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో ఉన్న పబ్ బాల్ రూంలో జనం ఎక్కువగా ఉండడంతో డ్రగ్స్ వదిన వారిని గుర్తించడంలో కష్టతరంగా మారింది. ఇక ఈకేసులో కీలకంగా మరీనా అనిల్, అభిషేక్ లకు చెందిన ఫోన్, ఐపాడ్‌లను పరిశీలిస్తున్న పోలీసులు..ఆమేరకు అందులో సమాచారాన్ని విశ్లేషిస్తే డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తీసుకున్నారన్న విషయం తెలిసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. పబ్‌లో డ్రగ్స్‌ వాడినవారెవరు అనే ప్రాథమిక వివరాలు తెలిస్తే వారిపై పరీక్షలు చేయించాలని పోలీసులు భావిస్తున్నారు. ఈఘటనలో ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌, రెస్టారెంట్‌ అండ్‌ బార్‌ లైసెన్స్‌ ను ఎక్సైజ్‌ శాఖ రద్దు చేసింది.

Also Read:Pudding And Mink Pub : ఫుడింగ్ అండ్ మింక్ ప‌బ్‌, బార్ లైసెన్స్ ర‌ద్దు చేసిన ఎక్సైజ్ శాఖ