PV Sindhu : నేను కూడా ఎదుర్కొన్నా.. ట్రోలింగ్, సైబర్ బుల్లింగ్‌‌పై పీవీ సింధు

ట్రోలింగ్, సైబర్ బుల్లింగ్ లను తానూ ఎదుర్కొన్నట్లు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అన్నారు. అయితే వీటిని తాను చాలా ధైర్యంగా ఎదుర్కొన్నానని ఆమె చెప్పారు.

PV Sindhu : నేను కూడా ఎదుర్కొన్నా.. ట్రోలింగ్, సైబర్ బుల్లింగ్‌‌పై పీవీ సింధు

Pv Sindhu

PV Sindhu : ట్రోలింగ్, సైబర్ బుల్లింగ్ లను తానూ ఎదుర్కొన్నట్లు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అన్నారు. అయితే వీటిని తాను చాలా ధైర్యంగా ఎదుర్కొన్నానని ఆమె చెప్పారు. అదే విధంగా మహిళలు, పిల్లలు కూడా ఇలాంటి సందర్భాల్లో అధైర్యపడొద్దని, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సింధు సూచించారు. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ధైర్యం కోల్పోకుండా పోలీసుల సహకారంతో సైబర్‌ అటాక్‌లకు చెక్‌ పెట్టాలని పిలుపునిచ్చారు. సైబర్‌ నేరాలపై మహిళలు, పిల్లలను చైతన్య పరిచేందుకు తెలంగాణ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పీవీ సింధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిల్లలను తల్లిదండ్రులు నిత్యం గమనిస్తూ ఉండాలని సింధు కోరారు. ఏదైనా సమస్యతో వారు బాధపడుతుంటే అధిగమించేందుకు చైతన్యం కల్పించాలన్నారు.

Unstoppable with NBK: రెండో సీజన్‌కి సర్వం సిద్ధం.. తొలి గెస్ట్ ఎవరంటే?

గత రెండేళ్లుగా ఉన్న కోవిడ్ నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగిందని, దాంతోనే సైబర్ నేరాలు కూడా భారీగానే పెరిగాయని, ఇవి ప్రధానంగా మహిళలు, పిల్లల కేంద్రీకృతంగా అధికమయ్యాయని సింధు అన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు షీ-టీమ్ లున్నాయనే భరోసాను ఎలాగైతే కల్పించాయో, సైబర్ మోసాలకు గురైతే, వెంటనే తమకు సైబర్ వారియర్లు ఉన్నారనే ధైర్యాన్ని కల్పించాలన్నారు. సైబర్ నేరాల బారిన పడితే వెంటనే సమీపంలోని పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. నిరంతర శ్రమ, అభ్యాసం ద్వారానే తన లాగా చాంపియన్ అవుతారని, అదే విధంగా ప్రతీ ఒక్కరు ప్రతీ రోజు ఏదో ఒక వ్యాయామం చేయాలని సూచించారు సింధు. వ్యాయామం ద్వారా సరి కొత్త శక్తి లభిస్తుందన్నారు.

”తమ పిల్లలను తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తుండాలి. పిల్లలకు ఏదైనా సమస్య వస్తే వాటిని అర్ధం చేసుకొని అధిగమించేందుకు వారిలో చైతన్యం కల్పించాలి. సైబర్ బుల్లియింగ్, ట్రోలింగ్ లను నేను కూడా ఎదుర్కొన్నా. ఈ సైబర్ బుల్లియింగ్, ట్రోలింగ్ ను ధైర్యంగా ఎదుర్కోవడంతో పాటు వీటిపై పోలీస్ శాఖలోని సైబర్ సెల్ కు ఫిర్యాదు చేయాలి. ఇంటర్నెట్ వినియోగం నిత్య జీవనంలో ఒక భాగమైంది. వీటిలో విద్యాపరమైన, స్ఫూర్తిదాయక, క్రీడా కార్యక్రమాలతోపాటు మానసిక వికాస కార్యక్రమాలను చూడడానికి ప్రాధాన్యతనిచ్చే విధంగా పేరెంట్స్ తగు జాగ్రత్తలు తీసుకోవాలి” అని సింధు సూచించారు. పాఠశాల స్థాయిలో విద్యార్థినీ, విద్యార్థులను సైబర్ వారియర్లుగా తయారు చేయడం పట్ల సింధు అభినందించారు.

Drink Alcohol : రోజు మద్యం తాగుతున్నారా…అయితే బరువు పెరుగుతున్నట్టే…

ఆన్ లైన్ క్లాసుల నేపథ్యంలో పెరిగిన మొబైల్ వాడకం ద్వారా సైబర్ నేరాలు కూడా పెరిగాయని మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రా అన్నారు. ఈ సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి రాష్ట్రంలోని ప్రతీ పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థినులు, ఒక మహిళా ఉపాధ్యాయినికి సైబర్ నేరాలను ఎదుర్కోనేందుకు సైబర్ కాంగ్రెస్ పేరుతో ప్రత్యేక శిక్షణ ఇప్పించామని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు 2వేల మంది టీచర్లు, 3వేల 500 మంది విద్యార్థినులకు ఈ శిక్షణ ఇప్పించామని స్వాతి లక్రా వెల్లడించారు.