Revanth Reddy : దళితుల ఓట్ల కోసమే కేసీఆర్ డ్రామాలు, అధికారంలోకి రాగానే రూ.2లక్షలు మాఫీ, 2లక్షల ఉద్యోగాలు-రేవంత్ రెడ్డి

Revanth Reddy:రైతులకు 2లక్షల రుణమాఫీ చేస్తాం. 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకుంటాం. రూ. 500 లకే ఆడబిడ్డలకు గ్యాస్ సిలిండర్ అందిస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా 5లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందిస్తాం.

Revanth Reddy : దళితుల ఓట్ల కోసమే కేసీఆర్ డ్రామాలు, అధికారంలోకి రాగానే రూ.2లక్షలు మాఫీ, 2లక్షల ఉద్యోగాలు-రేవంత్ రెడ్డి

Revanth Reddy(Photo : Twitter)

Revanth Reddy : దళితుల ఓట్ల కోసమే తెలంగాణ సీఎం కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ మేకవన్నె పులిలా దళితులను వేటాడుతున్నాడని రేవంత్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ పేరుతో దళితుల ఓట్లను కొల్లగొట్టాలని కేసీఆర్ చూస్తున్నారని చెప్పారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన కేసీఆర్.. ఆనాడు మేం ప్రాజెక్టుకు పెట్టిన అంబేద్కర్ పేరును ఎందుకు తొలగించారు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో దళితుల ఓట్ల కోసమే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. అవినీతి ఆరోపణలతో ఆనాడు దళిత ఉప ముఖ్యమంత్రిని కేసీఆర్ బర్తరఫ్ చేశారన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొడుకును మంత్రి పదవి నుంచి ఎందుకు బర్తరఫ్ చేయరు? అని నిలదీశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ లో కాంగ్రెస్ జై భారత్ సత్యాగ్రహ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో భాగంగా నస్పూర్ లో ఈ సభ నిర్వహించారు.

Also Read..Prakash Yashwant Ambedkar: దళిత బంధు పథకం ఫలాలు వారికి కూడా అందించాలని సీఎం కేసీఆర్‌ను కోరుతా..

‘పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ తరపున ఆదిలాబాద్ అడవి బిడ్డలకు మాట ఇస్తున్నా. అధికారంలోకి రాగానే ఆదిలాబాద్ జిల్లాను కాంగ్రెస్ పార్టీ దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఎండిన ఆకులు కొన్ని రాలినా.. కొత్త చిగురులు వస్తుంటాయి. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందనడానికి ఈ సభ నిదర్శనం. వెనుకబడిన జిల్లాల్లో 23వ జిల్లాగా ఆదిలాబాద్ ఉంది.

Also Read..Ambedkar statue: చివరి రక్తపుబొట్టు వరకు పోరాడతా: సీఎం కేసీఆర్

ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుంది. అటు మోదీని.. ఇటు కేడీని గద్దె దించి తీరతాం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోంది. కొత్త ఏడాదిలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు 2లక్షల రుణమాఫీ చేస్తాం. 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకుంటాం. రూ. 500 లకే ఆడబిడ్డలకు గ్యాస్ సిలిండర్ అందిస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా 5లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందిస్తాం” అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.