Revanth Reddy: కొత్త సెక్రటేరియట్‌కు వెళ్తున్న రేవంత్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. సచివాలయం వద్ద భారీగా పోలీసులు

Revanth Reddy: కొత్త సచివాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అంతేగాక అక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు.

Revanth Reddy: కొత్త సెక్రటేరియట్‌కు వెళ్తున్న రేవంత్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. సచివాలయం వద్ద భారీగా పోలీసులు

Revanth Reddy

Updated On : May 1, 2023 / 4:24 PM IST

Revanth Reddy: ఓఆర్ఆర్ టెండర్‌పై అధికారులను కలుస్తానంటూ వెళ్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్ లోని టెలిఫోన్ భవన్ వద్ద అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. టెండర్ ను 30 ఏళ్లకు ఓ సంస్థకు ఇవ్వడంపై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుంటోందని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు.

ఓఆర్ఆర్ లో జరిగిన అవినీతి బయటపడుతుందని ప్రభుత్వం భయపడుతోందని ఆయన ఆరోపించారు. పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని చెప్పారు. ఓ ఎంపీగా సెక్రటేరియట్ కు వెళ్తే ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరాలు ఏంటని నిలదీశారు. పోలీసులతో ఆయన వాగ్వివాదానికి దిగారు. అక్కడకు వెళ్లడానికి అనుమతి లేదని పోలీసులు చెప్పారు.

అధికారులను కలిసేందుకు రేవంత్ రెడ్డి ముందుగా అనుమతి తీసుకోలేదని అంటున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడి మళ్లీ రేవంత్ రెడ్డికి చెబుతామని పోలీసులు అన్నారు. సచివాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అంతేగాక అక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు.

కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ నిన్న ప్రారంభించిన విషయం తెలిసిందే. అక్కడకు వెళ్లి ఇవాళే ఓఆర్ఆర్ టెండర్‌పై అధికారులను కలవాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

TSPSC paper leak: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక పరిణామం