CM KCR-Revanth Reddy : కేసీఆర్‌కు ఆ పాపం ఊరికేపోదు .. దానికి ఫలితమే కూతురుకి ఏసీబీ నోటీసులు : రేవంత్ రెడ్డి

కేసీఆర్‌కు ఆ పాపం ఊరికేపోదు .. దానికి ఫలితమే కూతురుకి ఏసీబీ నోటీసులు అంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

CM KCR-Revanth Reddy : కేసీఆర్‌కు ఆ పాపం ఊరికేపోదు .. దానికి ఫలితమే కూతురుకి ఏసీబీ నోటీసులు : రేవంత్ రెడ్డి

CM KCR-Revanth Reddy : సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చేసిన పాపం ఊరుకే పోదు..అందుకే ఇప్పుడు ఏడవాల్సి వస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొనేసి కేసీఆర్ ఇప్పుడు మాత్రం బీజేపీ మా పార్టీ ఎమ్మెల్యేలను కొనాలని కుట్ర పన్నింది అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొన్నప్పుడు ఆ విషయం కేసీఆర్ కు తెలియదా? ఇప్పుడే కొత్తగా ఎమ్మెల్యేల కొనుగోలు జరుగుతున్నట్లుగా డ్రామాలాడుతున్నారంటూ విమర్శలు సంధించారు.

మా తాండూరు ఎమ్మెల్యేను కొనుగోలు చేసింది నువ్వే కదా..?అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ను ఖాళీ చేస్తే కేసీఆర్ కు ఆయన కొడుకుకు ఎదురే ఉండదని అనుకున్న కేసీఆర్ పాచికలు పారలేదని అందుకే ఇప్పుడు ఇతరపార్టీలపై విమర్శలు చేస్తున్నారు అంటూ ఆరోపించారు. 2015లో నన్ను అన్యాయంగా అరెస్ట్ చేయించి జైల్లో పెట్టారు ఆ పాపం కేసీఆర్ కు ఊరికే పోదని..నా కూతురు పెళ్లికి కూడా పోకుండా చేయాలని కేసీఆర్ కుట్ర పన్నారని..ఆ పాపం ఊరుకే పోదు అందుకే ఇప్పుడు కేసీఆర్ కూతురుకు సీబీఐ నోటీసులిచ్చింది. సీబీఐ నోటీలకు కేసీఆర్ పైకి చెప్పుకోలేక ఏడుస్తున్నాంటూ ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి.

పక్క పార్టీలను పతనం చేస్తే తనకు అధికారం శాశ్వతం అని విర్రవీగిన పాపం కూతురు కవితకు సీబీఐ ఇచ్చిన నోటీసులతో తండ్రీ బిడ్డలు పైకి చెప్పుకోలేక..దీంట్లో ఎలా బయపటడాలోనని మీటింగుల మీద మీటింగులు పెట్టుకుని తెగ చర్చించుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇన్ని చేసిన కేసీఆర్ ఇప్పుడేమో వగల ఏడుపులు ఏడుస్తున్నారని..అప్పుడు నా బిడ్డ పెళ్లికి వెళ్లకుండా కుట్రలు చేసినందుకు ఈరోజు నీ బిడ్డ ఇంటికి సీబీఐ వచ్చింది. ఇప్పుడు నీకు నొప్పి తెలుస్తుందా అని రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు.