Ys Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు..
సుప్రీంకోర్టు డైరెక్షన్‌లో కేసును మళ్లీ విచారించాలని వివేకా కూతురు సునీత సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Ys Viveka Case: ఏపీలో సంచలనం రేపిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. వివేకా హత్య కేసులో కొన్ని అంశాలపై రీ ఇన్వెస్టిగేషన్ చేయాలని సీబీఐని నాంపల్లి కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు డైరెక్షన్‌లో కేసును మళ్లీ విచారించాలని వివేకా కూతురు సునీత సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. తదుపరి ఇన్వెస్టిగేషన్ కు అనుమతులు ఇచ్చింది. A2 సునీల్ యాదవ్ బ్రదర్ కిరణ్, వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడి కుమారుడు అర్జున్ రెడ్డి ఫోన్ సంభాషణలపై దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. నెల రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలంది.
