Amarachinta : రూ. 100 విత్ డ్రా చేస్తే..రూ.500 నోటు..క్యూ కట్టిన జనాలు

మహబూబ్ నగర్ జిల్లాలోని అమరచింతలోని ఇండియా నెంబర్ 01 ఏటీఎం వద్దకు వెళ్లిన వారికి రూ.100 కు బదులు రూ. 500 నోటు వచ్చాయి.

Amarachinta : రూ. 100 విత్ డ్రా చేస్తే..రూ.500 నోటు..క్యూ కట్టిన జనాలు

Atm

India ATM : మీరు ఏటీఎంకు వెళ్లి..కార్డు పెట్టి..రూ. 100 డ్రా చేయాలని అనుకుంటే..ఎంతొస్తుంది ? గిదేం ప్రశ్న..మనం ఎంత డ్రా చేయాలని అనుకుని..ఎంట్రీ చేస్తే..అంతే మెషిన్ లో నుంచి వస్తాయి కదా..కానీ..ఓ ఏటీఎంలో మాత్రం రూ. 100 డ్రా చేయాలని అనుకుంటే..రూ. 500 నోటు వచ్చింది. విడివిడిగా రూ. 100, రూ. 200, రూ. 300 డ్రా చేసిన వ్యక్తికి..అకౌంట్ లో కేవలం రూ. 4 వేలు మాత్రమే తగ్గాయి. కానీ..అతని చేతికి వచ్చిందో ఎంతో తెలుసా ? రూ. 20 వేలు. ఈ వార్త దావానంలా వ్యాపించింది. ఇంకేముంది..ఆ ఏటీఎం ఎదుట క్యూ కట్టారు.

2021, మే 15వ తేదీ శనివారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లాలోని అమరచింతలోని ఇండియా నెంబర్ 01 ఏటీఎం వద్దకు వెళ్లిన వారికి రూ.100 కు బదులు రూ. 500 నోటు వచ్చాయి. స్థానికంగా ఈ విషయం పబ్లిసిటీ అయ్యింది. లాక్ డౌన్ మినహాయింపు సమయంలో..ఆ ఏటీఎం వద్దకు వెళ్లి..క్యూ కట్టి..డబ్బులు తీసుకున్నారు. అటుగా పోలీసులు వెళుతుండడం చూసి జనాలు పరుగులు తీశారు. అనుమానం వచ్చిన పోలీసులు ఓ వ్యక్తిని పట్టుకుని అసలు విషయం తెలుసుకున్నారు.

రూ. 4 వేలకు బదులు రూ. 20 వేలు వచ్చాయని చెప్పడంతో ఆ ఏటీఎంకు తాళం వేసి సంబంధిత బ్యాంకు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మూడు రోజుల్లో రూ. 5 లక్షల 88 వేలు డ్రా చేసినట్లు సిబ్బంది గుర్తించారు. సాంకేతిక లోపంతో సమస్య తలెత్తిందని, రూ. 100 బాక్స్ లో రూ. 500 నోట్లు ఉంచడంతో ఈ సమస్య ఏర్పడిందని గుర్తించారు. నగదు డ్రా చేసిన వారికి అదనంగా వచ్చిన డబ్బును స్వచ్చదంగా అప్పచెప్పాలని బ్యాంకు యాజమాన్యం సూచించింది.

Read More : Delhi NCR: పేరెంట్స్‌కు పరిచయం చేస్తానని నమ్మించి 25మందితో రేప్‌కు కారణమైన ఫేస్‌బుక్ ఫ్రెండ్