Palle Ravi Kumar Goud : మునుగోడు ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఝలక్.. కారెక్కిన కీలక నేత

మునుగోడు ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఝలక్ తగిలింది. మునుగోడు కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో రవికుమార్ దంపతులు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.

Palle Ravi Kumar Goud : మునుగోడు ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఝలక్.. కారెక్కిన కీలక నేత

Palle Ravi Kumar Goud : మునుగోడు ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఝలక్ తగిలింది. మునుగోడు కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో రవికుమార్ దంపతులు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ పాల్వాయి స్రవంతికి టికెట్ ఇవ్వడంతో.. అప్పటి నుంచి పల్లె రవికుమార్ పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. పల్లె రవికుమార్ భార్య జ్యోతి ప్రస్తుతం చండూరు ఎంపీపీగా ఉన్నారు. ‘కేటీఆర్ సమక్షంలో మేము అన్ కండిషనల్‌గా టీఆర్‌ఎస్ పార్టీలో చేరాం’ అని పల్లె రవికుమార్ తెలిపారు. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామని చెప్పారు.

మునుగోడులో ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పల్లె రవికుమార్ గౌడ్ మునుగోడు నియోజవర్గంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత. ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న పల్లె రవికుమార్.. మునుగోడులో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగారు. ముఖ్యంగా బీసీల్లో ఆయనకు మంచి పట్టుంది. మునుగోడు నియోజకవర్గంలో జనాభా పరంగా బీసీలే ఎక్కువ. అందులోనూ గౌడ వర్గానికి చెందిన వారు అధికం. ఈ నేపథ్యంలో మునుగోడు కాంగ్రెస్ టికెట్ తనకు ఇవ్వాలని, నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పార్టీ అధిష్టానాన్ని కోరారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతికి టికెట్ కేటాయించింది. టికెట్ ఆశించి భంగపడ్డ పల్లె రవికుమార్.. కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చారు. మంత్రి కేటీఆర్‌తో భేటీ అనంతరం పల్లె రవికుమార్ దంపతులు కారెక్కారు.