Beds Oxygen Shortage : తెలంగాణలో కరోనా విజృంభణ…ఆసుపత్రుల్లో బెడ్స్‌, ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ కొరత

తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో.. అప్రకటిత హెల్త్‌ హైఅలర్ట్‌ కొనసాగుతోంది. బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్స్‌ దొరకని పరిస్థితి నెలకొంది.

Beds Oxygen Shortage : తెలంగాణలో కరోనా విజృంభణ…ఆసుపత్రుల్లో బెడ్స్‌, ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ కొరత

Beds Oxygen Shortage

Beds and oxygen shortage : తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో.. అప్రకటిత హెల్త్‌ హైఅలర్ట్‌ కొనసాగుతోంది.. బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్స్‌ దొరకని పరిస్థితి నెలకొంది.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతు ప్రాణాలు పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది.. ఇప్పటికే గాంధీ, టిమ్స్‌, కింగ్‌ కోఠి ఆసుపత్రుల్లో వెంటిలేటర్‌ బెడ్స్‌ నిండుకున్నాయి.. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో బెడ్స్‌, ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ కొరత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో సదుపాయాల కొరతతో తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు.

మరోవైపు ప్రధాన ఆసుపత్రుల్లో సిబ్బంది లేక ఇబ్బందులు తప్పడం లేదు.. టిమ్స్‌లో చాలా వరకు బెడ్స్‌ ఉన్నా.. సిబ్బంది లేని పరిస్థితి ఉంది.. ఇక ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది.. ఇప్పటికే ఆసుపత్రుల్లో బెడ్స్‌ నిండిపోవడంతో పలు కార్పొరేట్‌ ఆసుపత్రులు రోగులను తిప్పి పంపుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం.. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల ఇబ్బందులకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటుంది. సమస్యల పరిష్కారానికి మానిటరింగ్‌ కమిటీ వేసే ఆలోచనలో ఉంది ఆరోగ్య శాఖ.. రెమ్‌డెసివిర్‌ కొరతపై ఇప్పటికే ఫార్మా కంపెనీలతో చర్చలు జరిపింది. ఓ వైపు కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తూనే.. వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టింది తెలంగాణ ప్రభుత్వం..

తెలంగాణలో వారం రోజుల వ్యవధిలో 28 వేల 778 కేసులు నమోదయ్యాయి.. ఒక్క ఆదివారం మినహా మిగతా అన్ని రోజుల్లో కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది.. మొత్తంగా చూస్తే వారంలో కేసుల సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగాయి. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో కూడా ఈ నెల 13న 361 కేసులు నమోదవ్వగా.. ఇప్పుడా సంఖ్య 800కు చేరువలో ఉందంటే పరిస్థితి రోజురోజుకు ఎంత దిగజారుతుందో అర్థం చేసుకోవచ్చు.