Perfumed Silk Saree : 27 రకాల సుగంధ పరిమళాలు వెదజల్లే పట్టు చీర

పట్టుచీర లంటే ఆడవారికెంత మక్కువో చెప్పక్కర్లేదు. అందులో ఉండే డిజైన్లు, రంగులు వారిని కట్టి పడేస్తాయి. అలాంటి పట్టు చీర సువాసనలు వెదజల్లితే ఎలా ఉంటుంది. అసలు మీరు ఎప్పుడైనా విన్నారా.. విని ఉండరు. కానీ ఇప్పుడ వింటారు, చూస్తారు. దాని పరిమళాన్ని ఆస్వాదిస్తారు.

Perfumed Silk Saree : 27 రకాల సుగంధ పరిమళాలు వెదజల్లే పట్టు చీర

siricilla weaver

Perfumed Silk Saree :  పట్టుచీర లంటే ఆడవారికెంత మక్కువో చెప్పక్కర్లేదు. అందులో ఉండే డిజైన్లు, రంగులు వారిని కట్టి పడేస్తాయి. అలాంటి పట్టు చీర సువాసనలు వెదజల్లితే ఎలా ఉంటుంది. అసలు మీరు ఎప్పుడైనా విన్నారా.. విని ఉండరు. కానీ ఇప్పుడ వింటారు, చూస్తారు. దాని పరిమళాన్ని ఆస్వాదిస్తారు. ఈ గొప్పదనం సిరిసిల్ల నేతన్నకు దక్కుతుంది.

గతంలో అగ్గిపెట్టేలో పట్టే చీరను తయారు చేసిన తెలంగాణ సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు పరంధాములు కుమారుడు విజయ కుమార్ ఇప్పుడు 27 రకాల సుగంధ పరిమళాలు వెదజల్లే పట్టుచీరను తయారు చేశారు. తండ్రి ఇన్స్పిరేషన్ తో విజయకుమార్ ఇప్పటికే పలు ప్రయోగాలు చేశాడు. తాజాగా 27 రకాల సుగంధ ద్రవ్యాలను కలిపిన ద్రావణంలో పట్టుపోగులను ఉడకబెట్టి పవర్ లూమ్ పై పట్టు చీరను నేశాడు.

సుగంధ ద్రవ్యాల ప్రభావంతో ఆ చీర పరిమళిస్తోంది. ఐదున్నర మీటర్ల పొడవు, 46 అంగుళాల వెడల్పు, 400 గ్రాముల బరువు ఉన్న ఈ చీరను నేయటానికి విజయకుమార్ కు నాలుగు రోజులు పట్టిందని చెప్పాడు. ఈ చీర తయారీకి రూ.12 వేలు ఖర్చయినట్లు విజయ్‌కుమార్‌ తెలిపారు. గతంలో మూడు కొంగుల చీర, ఉంగరంలో, దబ్బనంలో దూరే చీరలను, కుట్టు లేని లాల్చి, పైజామా, జాతీయ జెండాలను తయారు చేసి ప్రశంసలు అందుకున్నారు. ఏడాది తర్వాత ఈ చీరను ఉతికినా దీని సువాసన పోదని విజయకుమార్ చెప్పాడు.