చిన్న మొబైల్ షాపుకు రూ.12లక్షల బిల్లు: దటీజ్ కరోనా బిల్లు

  • Published By: nagamani ,Published On : June 13, 2020 / 09:33 AM IST
చిన్న మొబైల్ షాపుకు రూ.12లక్షల బిల్లు: దటీజ్ కరోనా బిల్లు

తెలంగాణాలోని మహబూబాబాద్‌లో ఓ చిన్న మొబైల్ షాపుకు ఏకంగా రూ.12 లక్షల కరెంటు బిల్లు వచ్చింది. వ‌చ్చిన బిల్లును చూసి షాప్ ఓనరకు దిమ్మ దిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. పిచ్చివాడిలో వెర్రి చూపులు చూస్తుండిపోయాడు. ఇది కలా? నిజమా? అనుకున్నాడు. నిజమే.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కాలేజీ రోడ్డులో ఓ వ్యక్తికి చిన్న మొబైల్ షాప్ ఉంది. లాక్ డౌన్ వల్ల మూడు నెలలుగా షాపు మూసే ఉంది. లాక్ డౌన్ సమయంలో కరెంట్ రీడింగ్ లు తీయటానికి ఎవ్వరూ రాలేదు. దీంతో అతని షాపునకు బిల్లు జనరేట్ అయ్యింది. నెల నెల రూ.300 నుంచి రూ.500 వరకు వస్తుండే.. బిల్లు ఒకేసారి అక్షరాల 12 లక్షల 4 వేల 738 రూపాయలు వచ్చింది. దానిని చూసిన షాపు ఓనర్ గుండె గుబేల్ మంది. లబోదిబోమంటూ అధికారుల దగ్గరకెళ్లాడు. కానీ ఎటువంటి స్పందనాలేదు.

రూ.12 లక్షల కరెంట్ బిల్లును తన ఇల్లు..తనకున్న కొద్దిపాటి స్థలం అమ్మినా ఈ కరెంట్ బిల్ కట్టలేని అనుకున్నాడు. స్థానిక విద్యుత్ అధికారిని సంప్రదించాడు. మీటర్‌లో సాంకేతిక లోపం వల్ల ఇంత బిల్లు వచ్చి ఉంటుందేమోనని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేస్తామని భరోసా ఇచ్చారు.

కాగా..లాక్‌డౌన్ వల్ల మీటర్ రీడింగ్ తీయకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. కొందరు వినియోగదారులకు బిల్లుల మోత మోగుతోంది.దీంతో సదరు బాధితులు ఇది కరెంటు బిల్లు కాదు బాబూ కరోనా బిల్లు అనుకుంటూ గుండెలు బాదుకుంటున్నారు.