Telangana Police Recruitment : నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్, ఆ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అభ్య‌ర్థుల వ‌యో ప‌రిమితిని మరో రెండేళ్లు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణ‌యం.

Telangana Police Recruitment : నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్, ఆ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు

Telangana Police Recruitment

Telangana Police Recruitment : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోలీస్ ఉద్యోగ నియామ‌కాల్లో అభ్య‌ర్థుల వ‌యో ప‌రిమితిని మరో రెండేళ్లు పెంచుతూ సీఎం కేసీఆర్ శుక్ర‌వారం నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం వయోపరిమిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ల విలువైన కాలాన్ని యువత కోల్పోయింది. ఈ నేపథ్యంలో వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచాలని నిరుద్యోగుల నుంచి వచ్చిన డిమాండ్ కు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.

కాగా, యూనిఫాం పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మూడేళ్ల గరిష్ఠ వయోపరిమితి సడలింపు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడంతో మరికొంత మంది అభ్యర్థులు పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభించినట్లు అయింది.

Telangana Police Recruitment: నిలిచిపోయిన పోలీస్ రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్.. ఆందోళనలో అభ్యర్థులు

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వయోపరిమితిని మూడేళ్ల పాటు పెంచింది. అయితే కనీసం ఐదేళ్లయినా పెంచాలని నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. ఈ క్రమంలో వయోపరిమితిని మరో రెండేళ్ల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల నిరుద్యోగ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పోలీస్‌, ఎక్సైజ్‌, ఫైర్‌, జైళ్లు, రవాణ శాఖల్లో కలిపి 17వేల 291 యూనిఫాం ఉద్యో‌గాల భర్తీకి ఈ నెల 2 నుంచి దర‌ఖాస్తు ప్రక్రియ ప్రారం‌భమైన విషయం తెలి‌సిందే. అన్ని విభా‌గా‌లకు కలిపి గురు‌వారం వరకు 5.2 లక్షల మంది అభ్య‌ర్థుల నుంచి 9.33 లక్షల దర‌ఖా‌స్తులు వచ్చి‌నట్టు అధికారులు తెలిపారు. వీటిలో మహిళా అభ్య‌ర్థుల నుంచే 2. 05 లక్షల దర‌ఖా‌స్తులు వచ్చా‌యని వెల్ల‌డిం‌చారు.

Telangana Police Jobs: తెలంగాణలో కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..పూర్తి వివరాలు..

మొత్తం పోలీస్ ఉద్యోగాల్లో… కానిస్టేబుల్ పోస్టులు 16,027 (సివిల్‌ కానిస్టేబుళ్లు 4,965.. ఏఆర్‌ కానిస్టేబుళ్లు 4,424.. టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్‌ కానిస్టేబుళ్లు 5,010.. స్పెషల్‌ పోలీస్‌ ఫోర్స్‌ 390, ఫైర్‌ 610, డ్రైవర్స్‌ 100 పోస్టులున్నాయి), ఎస్ఐ పోస్టులు 587 ఉన్నాయి. ఇప్పటికే లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం వయోపరిమితి పెంచడంతో మరింత మంది నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. నిన్న ఒక్క‌రోజే ల‌క్ష మందికి పైగా ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

రాష్ట్రంలో 95 శాతం స్థానికత ఆధారంగా నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా పోలీసు నియామక మండలి చేపట్టిన ఉద్యోగ నియామకాల ప్రక్రియలో ఈ విధానాన్ని మొదటిసారిగా అమలు చేస్తున్నారు.

RevanthReddy Letter To KCR : ఐదేళ్లకు పెంచండి, లేదంటే 4లక్షల మంది నష్టపోతారు-సీఎం కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి లేఖ

మొత్తం ఆరు నోటిఫికేషన్ల ద్వారా పోలీసు, అగ్నిమాపక, జైళ్ల శాఖ, ప్రత్యేక భద్రతా దళం, రవాణ, ఆబ్కారీ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది ప్రభుత్వం. వచ్చే మార్చి నాటికి ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని పోలీసు నియామక మండలి అధికారులు భావిస్తున్నారు.