#Sankranti2023: సాగు దండగ అన్న తెలంగాణలో నేడు పండగైంది: సీఎం కేసీఆర్

#Sankranti2023: సాగు దండగ అన్న తెలంగాణలో నేడు పండగైంది: సీఎం కేసీఆర్

CM KCR

#Sankranti2023: సాగు దండగ అన్న తెలంగాణలో నేడు అదే పండగైందని సీఎం కేసీఆర్ అన్నారు. వ్యవసాయ నమూనాను సమూలంగా మార్చాలని చెప్పారు. సంక్రాంతి సందర్భంగా ప్రజలకు ఆయన పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సంక్రాంతిని సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆయన అన్నారు. ప్రతి ఇల్లు సిరిసంపదలతో తులతూగాలని చెప్పారు.

భారత్ లో సాగు పండుగైన రోజే సంపూర్ణ క్రాంతి అని సీఎం కేసీఆర్ అన్నారు. ధాన్యం ఇళ్లకు చేరుకున్న వేళ సంక్రాంతిని జరుపుకుంటామని గుర్తు చేశారు. సాగులో తెలంగాణ సాధించిన విజయాలు దేశానికే మార్గదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పారు. ‘‘అరిష్టాలను, చెడును దహింపజేసే భోగభాగ్యాలను పంచేలా వచ్చిన ఈ భోగి పండు, అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నాను’’ అని కూడా కేసీఆర్ పేర్కొన్నారు.

కాగా, సీఎం కేసీఆర్ దంపతుల ఆధ్వర్యంలో నిన్న ప్రగతి భవన్ లో గోదాదేవి కల్యాణం నిర్వహించారు. వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా ఈ కల్యాణ మహోత్సవం జరిగింది. కాగా, ప్రజలకు తెలంగాణ మంత్రులు, ఇతర ప్రముఖులు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Santokh Singh: రాహుల్‌తో కలిసి భారత్ జోడో యాత్రలో నడుస్తుండగా ఎంపీ సంతోఖ్ సింగ్‌కి గుండెపోటు.. మృతి