Telangana Covid Terror Report : తెలంగాణలో కరోనా టెర్రర్.. భారీగా పెరిగిన కొత్త కేసులు

తెలంగాణలో కరోనావైరస్ మమహ్మరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తెలంగాణలో వరుసగా మూడో రోజు 400కిపైగా కొవిడ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. (Telangana Covid Terror Report)

Telangana Covid Terror Report : తెలంగాణలో కరోనా టెర్రర్.. భారీగా పెరిగిన కొత్త కేసులు

Telangana Covid

Telanganan Covid Terror Report : తెలంగాణలో కరోనావైరస్ మమహ్మరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తెలంగాణలో వరుసగా మూడో రోజు 400కిపైగా కొవిడ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. మంగళవారం రాష్ట్రంలో 403 కేసులు, బుధవారం 434 కేసులు నమోదు కాగా.. తాజాగా ఆ సంఖ్య 500లకు చేరువ కావడం టెన్షన్ పెట్టిస్తోంది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 28వేల 865 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 494 మందికి పాజిటివ్ గా తేలింది. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 315 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 102, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 31 కేసులు గుర్తించారు. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 126 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.(Telangana Covid Terror Report)

Corona Vaccine : ఆరు నెలల శిశువుకు అందుబాటులోకి కరోనా టీకా

రాష్ట్రంలో నేటివరకు 7లక్షల 97వేల 632 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7లక్షల 90వేల 473 మంది కోలుకున్నారు. క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది. రాష్ట్రంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 3వేల మార్క్ దాటడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే (2,680) 3,048కి పెరిగింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 27వేల 754 కరోనా టెస్టులు చేయగా.. 434 మందికి పాజిటివ్ గా తేలింది.(Telangana Covid Terror Report)

Bharat Biotech: నాజల్ వ్యాక్సిన్ ట్రయల్స్ చేసుకున్న భారత్ బయోటెక్

కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. అనవసర ప్రయాణాలు చేయొద్దని.. పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

అటు.. దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొవిడ్ కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో 13వేల 313 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. క్రితం రోజు 12వేల 249 కేసులు నమోదు కావడం గమనార్హం. ఇదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 10వేల 972 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 24గంటల వ్యవధిలో మరో 38 మంది కొవిడ్ తో మరణించారు. ప్రస్తుతం దేశంలో 83వేల 990 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 4,33,44,958కి పెరిగింది. వీరిలో 4,27,36,027 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,24,941 మంది మృతి చెందారు. దేశంలో రికవరీ రేటు 98.60 శాతంగా, పాజిటివిటీ రేటు 2.03 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా, క్రియాశీల రేటు 0.19 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,96,62,11,973 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 14,91,941 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.