Telangana Govt Green Signal : టీచర్ల దంపతుల కేటగిరి బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

టీచర్ల దంపతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. టీచర్ల దంపతుల బదిలీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్ల దంపతుల కేటగిరి బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Telangana Govt Green Signal : టీచర్ల దంపతుల కేటగిరి బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Telangana government

Telangana Govt Green Signal : తెలంగాణలో రేపటి నుంచి టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. టీచర్ల దంపతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. టీచర్ల దంపతుల బదిలీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్ల దంపతుల కేటగిరి బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దంపతులను ఒకే చోటుకు బదిలీ చేయాలని నిర్ణయించింది. గతంలో నిలిపి వేసిన 12 జిల్లాల్లో దంపతుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సూర్యాపేట మినహా 12 జిల్లాలో 427 మంది టీచర్ల బదిలీకి ఉత్తర్వులు జారీ చేసింది.

శుక్రవారం జనవరి 27,2023 నుంచి టీచర్ల పదోన్నతులు, బదిలీలు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో నెంబర్ 5ను గురువారం జారీ చేశారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదలీలు, మాన్యువల్ గా పదోన్నతులు జరుగనున్నాయి. రేపు కేటగిరీ ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితాలు ఆన్ లైన్ లో ప్రకటించనున్నారు.

Teachers Transfers, Promotions : టీచర్ల బదిలీలు, పదోన్నతులకు షెడ్యూల్ విడుదల

28 నుంచి 30 వరకు బదిలీల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల హార్డ్ కాపీలను ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు.. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డీఈవోకు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ లోపు అందజేయాలి.