High Court Judgment : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక తీర్పు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ విచారణకు లైన్ క్లియర్ అయింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది.

High Court Judgment : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక తీర్పు

High Court

High Court judgment : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ విచారణకు లైన్ క్లియర్ అయింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ ప్రభుత్వ అప్పీల్ పిటిషన్ ను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. సింగిల్ బెంచ్ తీర్పును అమలు చేయాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది. సీబీఐతో విచారణ జరపాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది.

సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ చేసింది. ప్రభుత్వ అప్పీల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో 111 పేజీలతో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ముగ్గురు నిందితుల హక్కులను సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకున్నారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ ను పూర్తిగా సమర్దిస్తామని డివిజన్ బెంచ్ తెలిపింది.

MLA Purchase Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం

సుప్రీంకోర్టు ఇచ్చిన రామ్ కిషన్ ఫోజి తీర్పును ధర్మాసనం ప్రస్తావించింది.  లెటర్స్ పేటెంట్ క్లాస్ 15 ప్రకారం కేసు పూర్తిగా క్రిమినల్ జురడిక్షన్ పరిధిలోకి వస్తుందని తెలిపింది. మెరిట్స్ లోకి వెళ్లకుండా క్రిమినల్ జురిడిక్షన్ పైనే ధర్మాసనం తీర్పు ఇచ్చింది. దీంతో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ విచారణకు లైన్ క్లియర్ అయింది.