Telangana Politics : మీరు పార్లమెంట్ రద్దు చేయండీ..మేం అసెంబ్లీ రద్దు చేస్తాం రండీ తేల్చుకుందాం : బీజేపీకి కేటీఆర్ సవాల్

ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ముందస్తున్న ఎన్నికలకు వచ్చే దమ్ము బీజేపీ ఉందా అంటూ ప్రశ్నించారు.

Telangana Politics : మీరు పార్లమెంట్ రద్దు చేయండీ..మేం అసెంబ్లీ రద్దు చేస్తాం రండీ తేల్చుకుందాం : బీజేపీకి కేటీఆర్ సవాల్

KTR's sensational comments about early elections

Telangana Politics : ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ముందస్తున్న ఎన్నికలకు వచ్చే దమ్ము బీజేపీ ఉందా అంటూ ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ పార్లమెంట్ ను రద్దు చేసి వస్తే తాము కూడా ముందస్తు ఎన్నికలకు వెళతామని ప్రజాక్షేత్రంలోనే ఎవరేంటో తేల్చుకుందాం అంటూ బీజేపీకి సవాల్ విసిరారు కేటీఆర్. మీరు పార్లమెంట్ ను రద్దు చేసి రండీ..మేం అసెంబ్లీని రద్దు చేసి వస్తాం..ప్రజల వద్దే ఎవరి దమ్ము ఏంటో తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు.

కాగా హుజారాబాద్ ఉప ఎన్నికల నుంచి బీజేపీకి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) కు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇదికాస్తా మునుగోడు ఉప ఎన్నికల నుంచి మరింతగా పెరిగింది. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లే ఉంది. ఈక్రమంలో కేసీఆర్ ముందుస్తు ఎన్నికలకు వెళతారంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి సంకేతాలు అన్నట్లుగా సంక్షేమ పథకాలకు ప్రభుత్వ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం మరింత ఊతమిస్తోంది.

ఇలా అధికార, ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న ఈ ముందస్తు మాటలు తెలంగాణలో ఎన్నికల హీట్ ను పుట్టిస్తున్నాయి. ఈక్రమంలో ముందుస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్లుగా సంకేతాలు అందుతున్నాయంటున్నారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నారన్నట్లుగా సమాచారం.ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోయినా నేతల మధ్య ఆయా నియోజకవర్గాల సీట్ల కేటాయింపుల గురించి చర్చలు నడుస్తున్నాయని తెలుస్తోంది.

సిట్టింగ్ నేతలు ఈసారి కూడా సీటు మాకే అనే ధీమాతో ఉంటే ఆశావహులు మాత్రం మైండ్ గేమ్ ఆడుతు ఈ సారి సీటు మాకే దక్కుతుందనే ధీమా వ్యక్తంచేస్తున్నారు.ఇలా ఆయా నియోజక వర్గాల్లో సీట్ల కేటీయింపుల గురించి వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. అలాగే ఈసారి తమ వారసులకు సీట్లు ఇప్పించుకోవాలని పథకాల్లో ఉండే నేతలు కూడా సీట్ల కేటాయింపుల గురించి లాబీయింగులు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సీఎం కేటీఆర్ పర్యటన సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నేతల మధ్య ఉన్న విబేధాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా సీట్ల కేటాయింపుల గురించి ఆయా నేతల వర్గీయుల మధ్య మాటల యుద్ధం..సీఎం కేసీఆర్ పర్యటనల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ఏర్పాట్లలో విభేధాలు బహిర్గం కావటం చూస్తుంటే సీట్ల గురించే నేతల మధ్య విభేదాలు పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈక్రమంలో మంత్రి కేటీఆర్ నిజామాబాద్ పర్యటనలో ముందస్తు ఎన్నికల వ్యాఖ్యలు చేయటం తెలంగాణలో ఎన్నికల హీట్ ను పుట్టిస్తోంది.