MLAs trap case : ఎమ్మెల్యేల ట్రాప్ కేసుని అందుకే సిట్ నుంచి సీబీఐకు అప్పగించాం : TS హైకోర్టు

మొయినాబాద్ ఫామ్ హౌసులో ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణను సిట్ నుంచి విచారణను సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక విషయాలు ప్రస్తావించింది.

MLAs trap case : ఎమ్మెల్యేల ట్రాప్ కేసుని అందుకే సిట్ నుంచి సీబీఐకు అప్పగించాం : TS హైకోర్టు

MLAs trap case SIT To CBI

MLAs trap case SIT To CBI  : మొయినాబాద్ ఫామ్ హౌసులో ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణను సిట్ నుంచి విచారణను సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక విషయాలు ప్రస్తావించింది. ఎమ్మెల్యే కొనుగోలు చేసే యత్నం ముమ్మాటికి తప్పేనని స్పష్టం చేసిన హైకోర్టు ఈ కేసు విషయంలో సీఎంకు సాక్ష్యాలుె ఎవరు ఇచ్చారనే విషయం చెప్పటంలో సిట్ విఫలమైంది అంటూ వ్యాఖ్యానించింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సిట్ ఆ దర్యాప్తు వివరాలను సీఎంకు చెప్పటమేంటి? అంటూ తీవ్రంగా ప్రశ్నించింది. దర్యాప్తు వివరాలను గోప్యంగా ఉంచాలని కానీ సిట్ మాత్రం దర్యాప్తు వివరాలను సీఎంకు చేరవేయటం సరైంది కాదని ఇది అభ్యంతరకర విషయం అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తుకు చెందిన అన్ని వివరాలు అధికారుల వద్ద ఉండాలి. కానీ దర్యాప్తు ద్వారా సేకరించిన అన్ని ఆధారాలను సిట్ సీఎంకు చేరవేయటమే కాకుండా ఆ వివరాలను మీడియా ద్వారా ప్రజలకు చెప్పటమేంటీ అంటూ వ్యాఖ్యానించింది దర్యాప్తు సమాచారాన్ని మీడియాతో సహా ఎవ్వరికి చెప్పకూడదనే విషయం సిట్ ఎందుకు విస్మరించింది? దర్యాప్తు ప్రారంభంలోనే కీలక ఆధారాలను బహిర్గతం చేయటం సరైంది కాదంటూ పరోక్షంగా సిట్ కు చీవాట్లు పెట్టింది హైకోర్టు.

అందేకాకుండా ఈ కేసు దర్యాప్తు విషయంలో సిట్ ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించిందని సిట్ చేసిన దర్యాప్తు కూడా ఏమాత్రం నిజాయితీగా లేదని అందుకే ఈ కేసును సిట్ నుంచి సీబీఐకు బదిలి చేశామని వెల్లడించింది హైకోర్టు. దర్యాప్తు చేసిన వివరాలను బహిర్గతం చేయటం వల్ల విచారణ సక్రమంగా జరగదని తేల్చి చెప్పిన ధర్మాసనం ఆర్టికల్ 20,21 ప్రకారం న్యాయమైన విచారణతో పాటు.. జీవో 63 ద్వారా ఏర్పాటు ద్వారా సిట్ ను రద్దు చేశామని స్పష్టంచేసింది ధర్మాసనం.

కాగా మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫామ్‌హౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని తెలంగాణ హైకోర్టు సోమవారం (డిసెంబర్ 26,2022) ఆదేశించింది. ఇప్పటివరకు ఈ కేసును తెలంగాణకు చెందిన సిట్ దర్యాప్తు చేస్తుండగా ఆ కేసును సిట్ నుంచి సీబీఐకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సిట్ చేస్తున్న దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో నిందితుల తరఫున బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపిన ధర్మాసం పిటిషనర్ల వాదనను పరిగణనలోకి తీసుకుంది. సిట్ నుంచి విచారణను సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది.

Telangana: కీలక మలుపు తిరిగిన ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు.. విచారణ సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఆదేశం

సిట్ దర్యాప్తును హైకోర్టు రద్దు చేసినట్లు, కేసు విచారణను వెంటనే సీబీఐకి అప్పగించాలని కోర్టు ఆదేశించినట్లు బీజేపీ తరఫు లాయర్, ఆ పార్టీ నేత రాంచందర్ రావు తెలిపారు. అక్టోబర్ 26న టీఆర్ఎస్ ఎమ్యెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే కారణంతో ఫామ్‌హౌజ్ నుంచి రామ చంద్ర భారతి, నంద కుమార్, సింహయాజిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు తెలంగాణ పోలీసులు. మరుసటి రోజు వారిని అరెస్టు చేసి, ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అయితే, కోర్టు నిందితులకు రిమాండ్ రిజెక్ట్ చేసింది. దీన్ని పోలీసులు హైకోర్టులో సవాల్ చేశారు.

ఏసీబీ నిర్ణయాన్ని రద్దు చేసిన హైకోర్టు, నిందితులకు రిమాండ్ విధించింది. అనంతరం దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని హైకోర్టులో బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నవంబర్ 4వరకు హైకోర్టు స్టే విధించింది. అయితే, నిందితులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. నవంబర్ 8న హైకోర్టు ఈ స్టే ఎత్తివేసింది. నవంబర్ 9న ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో సిట్ ఏర్పాటైంది. నిందితుల పోలీస్ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. కస్టడీలోకి తీసుకున్న నిందితులకు పోలీసులు ఎఫ్ఎస్ఎల్‌లో స్వర నమూనా పరీక్షలు నిర్వహించారు. సిట్ దర్యాప్తును సవాల్ చేస్తూ, నవంబర్ 14న హైకోర్టులో నిందితుల తరఫున బీజేపీ మరో పిటిషన్ దాఖలు చేసింది. కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరింది. ఈ నెల 1న నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బీజేపీ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు తాజాగా కేసును సిట్ నుంచి సీబీఐకి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది.