Telangana New Secretariat : ఫిబ్రవరి 17న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం..హాజరుకానున్న బీఆర్ అంబేద్కర్ మనుమడు

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ నూతన సచివాలయం ప్రారంభంకానుంది. సీఎం కేసీఆర్ పుట్టినరోజు అయి ఫిబ్రవరి 17 శుక్రవారం రోజు ఉదయం 11.30 గంటలకు తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభంకానుంది.

Telangana New Secretariat : ఫిబ్రవరి 17న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం..హాజరుకానున్న బీఆర్ అంబేద్కర్ మనుమడు

Telangana New Secretariat will be inaugurated by CM KCR on February 17

Telangana New Secretariat : తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఫిబ్రవరి (20230 17న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ నూతన సచివాలయం ప్రారంభంకానుంది. సీఎం కేసీఆర్ పుట్టినరోజు అయి ఫిబ్రవరి 17 శుక్రవారం రోజు ఉదయం 11.30 గంటలకు తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభంకానుంది. ఈ ప్రారంభోత్సవానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, జేడీయూ నేత లలన్ సింగ్ హాజరుకానున్నారు. అలాగే భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ కూడా హాజరుకానున్నారు. నూతన సచివాలయం ప్రారంభించిన అనంతరం పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.తెలంగాణ నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవన్ గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. అందుకే అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు ప్రకాశ్ అంబేద్కర్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.

Tirupati sculptures In TS new Secretariat : తెలంగాణ సచివాలంలో కొలువుతీరనున్న తిరుపతి శిల్పాలు
తరచుగా యజ్ఞాలు చేసే కేసీఆర్ ఇక నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముందు వాస్తు పూజ, సుదర్శన యాగం, చండీ యాగం చేయనున్నారు. కాగా ఈ నూతన సచివాలయం 2022లో దసరా పండుగ రోజున ప్రారంభంకావాల్సి ఉంది. కానీ పనులు పూర్తికాకపోవటంతో ఈ కార్యక్రమం వాయిదా పడి 2023లో కేసీఆర్ పుట్టినరోజున ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో నిర్మాణ పనులు వేగవంతం చేసి ఫ్రిబవరి 17న ప్రారంభించనున్నారు. కాగా తెలంగాణ సచివాలయానికి సీఎం కేసీఆర్ 2019 జూన్ 27న భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. భూమి పూజ కేసీఆర్ పుట్టిన రోజునే జరిగింది. ఇక కొత్త సచివాలయం ప్రారంభంకూడా కేసీఆర్ పుట్టిన రోజునే ప్రారంభంకానుంది. ఇలా తెలంగాణ చరిత్రలో కేసీఆర్ నిలిచిపోనున్నారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టిన స్వరాష్ట్రాన్ని సాధించటంలో అత్యంత కీలక పాత్ర పోషించిన కేసీఆర్ తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం నిలిచే ఉంటారు. అలా తెలంగాణ అంటే కేసీఆర్ అనే రీతిలో కేసీఆర్ పేరు నిలిచిపోనుంది.