KTR : ఇల్లు లేనివారందరికి ఏడాదిలోగా సొంత ఇల్లు ఇచ్చే బాధ్యత నాది

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..పండుగ వాతావరణంలో సొంత ఇళ్ల కల సాకారం చేసుకుంటున్నామనీ.. కేసీఆర్ పేదల ఆత్మగౌరవం నిలపటం కోసం సొంత ఇళ్లు నిర్మించారని అన్నారు. ఇళ్లు లేని వారందరికి ఏడాదిలోగా సొంత ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు.

KTR : ఇల్లు లేనివారందరికి ఏడాదిలోగా సొంత ఇల్లు ఇచ్చే బాధ్యత నాది

Ktr Inaugurated Double Bedroom House (1)

KTR inaugurated double bedroom house : పేదలందరికి సొంత ఇల్లు ఏర్పాడాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించే బృహత్ కార్యం తలపెట్టిన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా పలు జిల్లాల్లో ఇళ్ల నిర్మాణం చేసి పేదలకు అందిస్తున్నారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..పండుగ వాతావరణంలో పేదవారికి సొంత ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని అన్నారు.సీఎం కేసీఆర్ పేదల ఆత్మగౌరవం కోసం సొంత ఇళ్లు నిర్మించారని..దీంట్లో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లాలో పేదలకు 264 ఇల్లు కేటాయించారని తెలిపారు.

ఇళ్లు లేని వారందరికి సొంత ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత నాది అని కేటీఆర్ హామీ ఇచ్చారు.గత పాలకులు పేదలకు ఇళ్లు ఇస్తామని పిట్ట గూడుల్లాంటివి కట్టారని కానీ సీఎం కేసీఆర్ కట్టించే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వారి సొంతింటి కలను సాకారం చేసినట్లుగా ఉన్నాయని అన్నారు. పేదల కోసం వారి ఆత్మగౌరం నిలపటం కోసం లక్షల ఇళ్లు కడుతున్నామని అన్నారు.ఇళ్ల నిర్మాణంలో ఎటువంటి అవినీతి తావు ఇవ్వకుండా ఇళ్లను మంజూరు చేస్తున్నామని అలాగే..పేదల నుంచి పైసా కూడా తీసుకోకుండా ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని అన్నారు. భూములకు డిమాండ్ ఉన్న చోట డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తున్న ఘనత కేసీఆర్ ది మాత్రమేనన్నారు.

పైసా ఖర్చు లేకుండా హైదరాబాద్ అపార్ట్ మెంట్ తరహాలో ఇళ్లు నిర్మించి అందిస్తున్నాం. ఇళ్లు నిర్మించిన ప్రాంతాల్లో పచ్చదనం నిండిపోయేలా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు మంత్రి కేటీఆర్ సూచించారు. పచ్చని చెట్లతో కాలనీలన్నీ కళకళలాడిపోయేలా తీర్చి దిద్దుకోవాలని అన్నారు.కరోన సమయంలో ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడ్డాం…కానీ పచ్చదనం పెరిగితే ప్రజలందరికీ చక్కటి ఆక్సిజన లభిస్తుందని..అందుకే డబుల్ బెడ్ ఇళ్ల పరిసర ప్రాంతాలన్నీ పచ్చదనంతో నిండిపోయేలా చేసుకోవాలని సూచించారు.అలాగే ప్రజల కోసం పింఛన్లు ఇస్తున్నాం. గతకంటే ఫించన్లు పెంచాం. 40లక్షల మందికి పింఛన్ ఇస్తున్నాం. కానీ కొంతమంది మాకు ఫించన్లు రావటల్లేదని అంటున్నారు.అటువంటివారికి కూడా త్వరలోనే ఇస్తామని హామీ ఇచ్చారు.

అలాగే రేషన్ కార్డులు కూడా త్వరలోనే ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చారు. బీడీ కార్మికులకు 2వేల పింఛన్ ఇస్తున్న ఘనత కేసీఆర్ దని…కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో దారిద్ర్యంగా ఉన్న రాజన్న సిరిసిల్లను పంటలతో కళకళలాడేలా చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. దుర్భిక్షంగా ఉండే రాజన్న సిరిసిల్ల జిల్లా ఇప్పుడు కోనసీమగా మారబోతోందని అన్నారు. భారత దేశంలో ఎక్కడ ఇంత పెద్ద మొత్తంలో డబుల్ బెడ్ ఇళ్ళ నిర్మాణం జరగలేదనీ..కరోనా కష్టకాలంలో ఇళ్ళ నిర్మాణం ఆలస్యం అయ్యింది…కానీ సమన్వయం చేసుకుంటూ ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని అన్నారు.