Voters List : తెలంగాణలో ఎంత మంది ఓటర్లున్నారో తెలుసా..?

రాష్ట్రంలో పురుష ఓటర్లు కోటీ 52 లక్షల 56 వేల 474 మంది ఉండగా, మహిళా ఓటర్లు కోటీ 50 లక్షల 98వేల 685 మంది ఉన్నారు. థర్డ్‌ జండర్‌ 1735 మంది ఉన్నారు.

Voters List : తెలంగాణలో ఎంత మంది ఓటర్లున్నారో తెలుసా..?

Voter List

list of voters in Telangana : తెలంగాణలో ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణలో మొత్తం ఓటర్లు 3 కోట్ల 3 లక్షల 56 వేల 894 మంది అని తేల్చింది. ఇందులో పురుష ఓటర్లు కోటీ 52 లక్షల 56 వేల 474 మంది ఉండగా, మహిళా ఓటర్లు కోటీ 50 లక్షల 98వేల 685 మంది ఉన్నారు. థర్డ్‌ జండర్‌ 1735 మంది ఉన్నారు.

2021 జనవరితో పోల్చుకుంటే 2022 జనవరి నాటికి కొత్తగా 2.84 లక్షలకుపైగా ఓటర్ల సంఖ్య నమోదు అయింది. కాగా 92,934 మంది పేర్లను ఓటర్ లిస్టు నుంచి తొలగించారు. దీంతో నికరంగా పెరిగిన ఓటర్ల సంఖ్య 1,91,325 కు పరిమితమైంది. ఈ ఏడాదిలో 18-19 ఏళ్ల వయస్సు కల్గిన 1,36,496 మంది యువ ఓటర్లు కొత్తగా ఓటర్ లిస్టులో చేరారు.

Five Killed : గుజరాత్ లో విషాదం.. రసాయనాలు లీకై ఐదుగురు మృతి

తెలంగాణలోని ఓటర్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ బుధవారం ప్రకటించారు. ఎన్నికల కమిషన్ ప్రతి సంవత్సరం జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం చేపడుతోంది. కొత్త ఓటర్ల నమోదు, చిరునామాల మార్పు, చనిపోయిన వారి పేర్ల తొలగింపును నిర్వహిస్తోంది.