ప్రతిరోజూ కరోనా బులెటిన్‌ విడుదల చేయాలని హైకోర్టు ఆదేశం

ప్రతిరోజూ కరోనా బులెటిన్‌ విడుదల చేయాలని హైకోర్టు ఆదేశం

Corona Bulletin release every day : తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. రేపటి నుంచి ప్రతిరోజూ కరోనా బులెటిన్‌ విడుదల చేయాలని ఆదేశించింది. అంతేకాదు..రాష్ట్రంలో వీలైనంత త్వరలో సీరం సర్వే చేయాలని సూచించింది. సర్వే నివేదికలోని సిఫార్సులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. కరోనా పరీక్షల నివేదికను ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. జనవరి 25 నుంచి ఈ నెల 12 వరకు జరిపిన పరీక్షల వివరాలను ప్రభుత్వం తెలిపింది.

రాష్ట్రంలో వీలైనంత త్వరలో సీరం సర్వే చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. సర్వే నివేదికన సిఫార్సులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆర్‌టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటీ జెన్ పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. జూన్‌ 3 నుంచి డిసెంబర్‌ వరకు 3 సీరం సర్వేలు జరిగాయని ప్రభుత్వం వెల్లడించింది. రెండో దశ కరోనా కేసులు పెరిగే ప్రమాదం పొంచి ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతున్నాయని… ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. రేపటి నుంచి ప్రతి రోజూ కరోనా బులిటెన్ విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణ వచ్చే నెల 18కి వాయిదా వేసింది.