India Book of Records : రెండేళ్ల చిన్నారికి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో చోటు

రెండేళ్ల చిన్నారి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో చోటు దక్కించుకున్నాడు. కరీంనగర్‌ కు చెందిన అశోక్‌రెడ్డి, ఆశ్రితల కుమారుడు వేదాంశ్‌ సాయిరెడ్డికి కార్డు, మెడల్ ను అందించారు.

India Book of Records : రెండేళ్ల చిన్నారికి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో చోటు

Book

two-year-old win : రెండేళ్ల చిన్నారి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో చోటు సంపాదించాడు. కరీంనగర్‌ సప్తగిరికాలనీకి చెందిన అశోక్‌రెడ్డి, ఆశ్రితల కుమారుడు వేదాంశ్‌ సాయిరెడ్డి ప్రతిభను గుర్తించి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు వారు ప్రశంసిస్తూ కార్డు, మెడల్‌ను అందించారు. ఏడు పక్షులు, 24 జంతువులు, 22 శరీర భాగాలు, 10 ఆహారపు వస్తువులు, 13 పండ్లు, 2 కూరగాయలు, నంబర్స్‌, 8 జీకే ప్రశ్నలకు జవాబులు చెబుతాడు.

21 రకాల అభినయం, ప్రపంచ పటం, ఆకారాల పజిల్స్‌ పూర్తి చేస్తాడు. పేపర్‌ కప్పులతో పిరమిడ్‌ తయారు చేస్తాడు. వేదాంశ్‌ సాయిరెడ్డి ప్రస్తుతం రెండు సంవత్సరాల మూడు నెలల వయస్సులో ఇవన్నీ చేయడం తల్లిదండ్రులు, బంధు మిత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Palanpur Seed Bank : అంతరించే మొక్కల్ని కాపాడుతున్న యువ టీచర్..ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ గుర్తింపు

గతంలో మూడేళ్ల చిన్నారి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో చోటు దక్కించుకున్నాడు. ఆలూరు కోటవీధికి చెందిన ప్రశాంత్‌, చంద్రిక దంపతుల కుమారుడు అకీరా నందన్‌. స్థానిక ప్రైవేటు పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు. తల్లిదండ్రులు చెప్పే ఏ విషయాన్నైనా ఇట్టే పసిగట్టి నేర్చుకునేవాడు అకీరా. బాలుడి ప్రతిభను గుర్తించిన వారు అనేక అంశాల్లో పట్టు సాధించేలా చేశారు.

అలా మూడేళ్ల వయసులోనే 7 వారాల పేర్లు, 11 తెలుగు ప్రాసలు, 7 దేవుడి శ్లోకాలు, 3 తెలుగు పద్యాలు, 5 ఇంద్రియాలు, 12 నెలల పేర్లు, 11 ఆంగ్ల ప్రాసలు, ఆంగ్ల సంబంధిత పదాలతో వర్ణమాల, 14 వాహనాల పేర్లు, 4 రుతువుల పేర్లు, 11 దశావతారాలు, 14 సంతువుల పేర్లు, 15 జాతీయ చిహ్నాలు, 12 నీటి జంతువుల పేర్లు, జనరల్‌ నాలెడ్జ్‌కు సంబంధించిన పలు ప్రశ్నలకు టకటక సమాధానాలు చెప్పేస్తాడు.

Ganesh Immersion : భాగ్యనగరంలో నిమజ్జన కోలాహలం..ట్యాంక్‌బండ్‌కు గణనాథుల క్యూ

దీంతో తల్లిదండ్రులు బాలుడి ప్రతిభను వీడియోలో చిత్రీకరించి మేలో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌కు పంపించారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సంస్థ ప్రతినిధులు నేరుగా కాకుండా ఆన్‌లైన్‌లోనే బాలుడి ప్రతిభను పరీక్షించి రికార్డు నమోదు చేశారు. పతకం, ప్రశంసాపత్రం పోస్టులో పంపించారు.