కాళేశ్వరం ప్రాజెక్టు : మూడో మోటార్ ట్రయల్ రన్ విజయవంతం

  • Published By: veegamteam ,Published On : May 15, 2019 / 11:16 AM IST
కాళేశ్వరం ప్రాజెక్టు : మూడో మోటార్ ట్రయల్ రన్ విజయవంతం

కాళేశ్వరం ప్రాజెక్టు నందిమేడారం 6వ ప్యాకేజీలో మూడో మోటార్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ఇప్పటికే రెండు మోటార్ల ట్రయల్ రన్ విజయవంతం చేశారు. ప్రస్తుంతం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మూడో మోటార్ నీటిని ఎత్తిపోస్తుంటే అధికారులు సంబరాలు చేసుకుంటున్నారు. గోదావరి జలాలను మూడో మోటార్ ఎత్తిపోయనుంది.

100 మీటర్ల లోతు నుంచి గోదావరి జలాలు ఉబికి వస్తున్నాయని అధికారులు తెలిపారు. నీటిని బ్యారేజీలోకి లిఫ్టు చేస్తామని చెప్పారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు మార్నింగ్ నాలుగో మోటార్ ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. నాలుగో పంపుకు కూడా సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు. మిగిలిన పంపులను కూడా ఖరీప్ పంట కాలం లోపు పూర్తి చేస్తామన్నారు. 
ఏడు, ఎనిమిది ప్యాకేజీ పనులను అతిత్వరలో పూర్తి చేస్తామన్నారు. ఖరీఫ్ లో రైతులందరికీ నీరివ్వాలనే సంకల్పంతో పని చేస్తున్నామని అధికారులు చెప్పారు.

లింకు 2లో ఆరో ప్యాకేజీ పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. ప్యాకేజీ 7 లో పనులు ఆలస్యం అయ్యాయని.. అతి త్వరలో దాన్ని కూడా పూర్తి చేస్తామన్నారు. మే నెల చివరి వరకు క్లీనింగ్ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. మొదటివారంలో క్లీనింగ్, బెడ్ లైనింగ్ పూర్తి చేసుకుని ఖరీఫ్ లో రైతాంగానికి నీరివ్వడానికి ప్రభుత్వ పరంగా సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎనిమిదో ప్యాకేజీ పనులు 95 శాతం పూర్తి అయ్యాయని తెలిపారు. చిన్న చిన్న ఫినిషింగ్ పనులు మిగిలి ఉన్నాయన్నారు. వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు.

ఆరవ ప్యాకేజీలో మొత్తం ఏడు పంపులు ఉంటాయని అధికారులు తెలిపారు. 105 మీటర్ల నీటిని ఎత్తిపోస్తుందని… ఒక్కొక్క పంపు సామర్థ్యం 124.4 మెగా వాట్లుగా ఉందన్నారు. ప్యాకేజీ 8 లో కూడా ఏడు పంపులు ఉంటాయని ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్థ్యం ఉంటుందని తెలిపారు. 115 మీటర్లు లిఫ్ట్ చేస్తామని అధికారులు తెలిపారు. ఏడు పంపులను రన్ చేస్తే ఒక రోజు రెండు టీఎంసీల నీటిని పంప్ చేసే అవకాశం ఉందన్నారు.