గులాబీ గుబాళింపు : మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా

  • Published By: veegamteam ,Published On : January 25, 2020 / 05:12 AM IST
గులాబీ గుబాళింపు : మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా

తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ హవా నడుస్తోంది. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకుపోతోంది. ఇప్పటివరకు 2 కార్పొరేషన్, 13 మున్సిపాలిటీలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో వస్తున్న ఫలితాలు టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అప్పుడే సంబరాలు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ భవన్ దగ్గర కోలాహలం నెలకొంది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ భవన్ కు చేరుకున్నారు. ఎమ్మెల్సీలు కేకే, పల్లాలు తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేశారు.

మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరా తీస్తున్నారు. తెలంగాణ భవన్ నుంచి ఫలితాల సరళిని ఆయన తెలుసుకుంటున్నారు.

9

శనివారం(జనవరి 25,2020) ఉదయం 8 గంటలకు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 134 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ప్రతి వార్డుకు రెండు టేబుల్స్ ను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నంలోపు ఫలితాలు వెలువడనున్నాయి. మొద‌ట పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారు. తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని బ్యాలెట్ పత్రాలను పార్టీల వారిగా విభ‌జించి బండిల్‌గా కట్టి.. లెక్కిస్తున్నారు. 

99

120 మున్సిపాలిటీలు.. 9 కార్పొరేషన్లలో 12వేల 926 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి కూడా టీఆర్ఎస్ జోరు స్పష్టంగా కనిపించింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తొలి బోణీ కొట్టింది టీఆర్ఎస్సే. తొలుత పరకాల, చెన్నూరు మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చెన్నూరులో మొత్తం 18 వార్డులను దక్కించుకుంది. పరకాలలో మొత్తం 22 వార్డులు కైవసం చేసుకుంది. 

టీఆర్ఎస్ గెలిచిన మున్సిపాలిటీలు:
కరీంనగర్ : కొత్తపల్లి, పెద్దపల్లి మున్సిపాలిటీలు
ఆదిలాబాద్ : చెన్నురూ మున్సిపాలిటీ
వరంగల్ రూరల్ : వర్ధన్నపేట, పరకాల మున్సిపాలిటీలు
వర్ధన్నపేట(12) : టీఆర్ఎస్-8, కాంగ్రెస్-2, బీజేపీ-1, ఇండిపెండెంట్-1 గెలుపు
మహబూబాబాద్ : మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీలు

మరిపెడ మున్సిపాలిటీలోని మొత్తం 15 వార్డుల్లో టీఆర్ఎస్ గెలుపు
మెదక్ : బొల్లారం మున్సిపాలిటీ
జవహర్ నగర్, మీర్ పేట కార్పొరేషన్లు టీఆర్ఎస్ కైవసం

Also Read : ప్లీజ్.. కేటీఆర్ ను కలిసే అవకాశమివ్వండి : బ్యాలెట్ బాక్సులో ఓట్లతో పాటు లెటర్