YS Sharmila : వైఎస్ షర్మిలపై అసెంబ్లీ స్పీకర్‌కు ఎమ్మెల్యేల ఫిర్యాదు.. చర్యలు తీసుకునే అవకాశం

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర సమయంలో షర్మిల నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు ఎమ్మెల్యేలు.

YS Sharmila : వైఎస్ షర్మిలపై అసెంబ్లీ స్పీకర్‌కు ఎమ్మెల్యేల ఫిర్యాదు.. చర్యలు తీసుకునే అవకాశం

YS Sharmila : వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర సమయంలో షర్మిల నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు ఎమ్మెల్యేలు. ఇటీవల మంత్రి నిరంజన్ రెడ్డి పై కాస్త ఘాటుగానే షర్మిల వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న ఎమ్మెల్యేలు.. షర్మిలపై అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకుంటామని స్పీకర్ అన్నారు. కాగా, ప్రివిలేజ్ నిబంధనల ప్రకారం షర్మిలపై స్పీకర్ పోచారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఇదే ఇష్యూపై డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు మంత్రి నిరంజన్ రెడ్డి.

సీఎం కేసీఆర్‌, మంత్రులపై షర్మిల నిరాధార ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. శాసన సభ్యుల గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు షర్మిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై మంత్రులు, ఎమ్మెల్యేలతో సభాపతి చర్చించారు. తగిన చర్యలు తీసుకుంటామని, సభ్యుల హక్కులను పరిరక్షిస్తామని సభాపతి హామీ ఇచ్చారు. షర్మిలపై మంత్రులు ఇచ్చిన ఫిర్యాదును సభాహక్కుల ఉల్లంఘన కమిటీకి పంపించారు. దీనిపై సభాహక్కుల ఉల్లంఘన కమిటీ బుధవారం సమావేశమయ్యే అవకాశముంది.