TRS-PM Modi : ప్రధాని మోదీపై లోక్ సభలో ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిన టీఆర్ఎస్ ఎంపీలు

ప్రధాని మోదీపై లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. లోక్ సభ జనరల్ సెక్రటరీకి నోటీసు అందించారు. పార్లమెంట్ ను అగౌరవపరచడం బాధాకరమని అన్నారు.

TRS-PM Modi : ప్రధాని మోదీపై లోక్ సభలో ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిన టీఆర్ఎస్ ఎంపీలు

Kk

TRS MPs privilege motion : ఏపీ రాష్ట్ర విభజనపై ప్రధానమంత్రి మోదీ చేసిన విమర్శలు తెలుగు రాష్ట్రాల్లో హీట్ పెంచుతున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ కు చెందిన నేతలు..ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల విభజన అందరి అభిప్రాయాల మేరకు జరగలేదంటూ పార్లమెంట్ లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీ నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రధాని మోదీపై లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. లోక్ సభ జనరల్ సెక్రటరీకి నోటీసు అందించారు. అనంతరం టీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ప్రధానికి తగదన్నారు. పార్లమెంట్ ను అగౌరవపరచడం బాధాకరమని అన్నారు.

ఇవాళ ఉదయం రాజ్యసభ చైర్మన్ కార్యాలయంలో ప్రధాని మోదీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు ఇచ్చారు. ఈ సమావేశాలను టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించారు. రూల్ 187 కింద ప్రివిలేజ్ మోషన్ ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఏర్పాటును కించపరిచేలా ఫిబ్రవరి 8న రాజ్యసభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. పార్లమెంట్ కార్యకలాపాలను, చట్ట సభను దిగజార్చేలా, పార్లమెంట్ ప్రిసైడింగ్ అధికారులను అగౌరవ పరిచేలా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయని వెల్లడించారు.

Solar Storm : సౌర తుఫాన్ ఎఫెక్ట్.. గాలిలోనే మండిపోయిన 40 ఉపగ్రహాలు

ఏపీ విభజనపై పార్లమెంట్‌ వేదికగా ప్రధాని మోదీ చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. రాజకీయ స్వార్థం కోసమే, ఏపీని హడావుడిగా విభజించారంటూ మోదీ ఆరోపించారు. ఏపీ, తెలంగాణ వైషమ్యాలకు కాంగ్రెస్‌ పార్టీనే కారణమని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదన్న మోదీ.. విభజన కోసం అనుసరించిన పద్ధతి సరిగా లేదని తెలిపారు. తెలంగాణ ఇచ్చినా.. కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మలేదని అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో గులాబీ పార్టీ నేతలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.