TSPSC Paper Leak : టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో నలుగురు నిందితులకు జ్యుడిషియల్ కస్టడీ

నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, డాక్య నాయక్, రాజేశ్వర్ లకు 14రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది నాంపల్లి కోర్టు. దాంతో పోలీసులు వారిని చంచల్ గూడ జైలుకి తరలించారు.

TSPSC Paper Leak : టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో నలుగురు నిందితులకు జ్యుడిషియల్ కస్టడీ

TSPSC Paper Leak : తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ కేసులో నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది నాంపల్లి కోర్టు. నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, డాక్య నాయక్, రాజేశ్వర్ లకు 14రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది నాంపల్లి కోర్టు. దాంతో పోలీసులు వారిని చంచల్ గూడ జైలుకి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం నిందితులను జైలుకి తీసుకెళ్లారు. ఇక ఇదే కేసులో మరో ముగ్గురు నిందితులకు(షమీమ్, సురేశ్, రమేశ్) పోలీసు కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు.

Also Read..TSPSC paper leak: రూ.100 కోట్ల మేర దావా… రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కి కేటీఆర్ లీగల్ నోటీసులు

పేపర్ లీక్ కేసులో నలుగురు నిందితులను సిట్ అధికారులు మూడు రోజుల పాటు విచారించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఇక ఈ కేసులో నిందితులు ఏ-10 షమీమ్, ఏ-11 సురేశ్, ఏ-12 రమేశ్ లను వారం రోజుల కస్టడీకి కోరుతూ సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. వారిని 5 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

చంచల్ గూడ జైల్లో ఉన్న షమీమ్, రమేశ్, సురేశ్ లను బుధవారం ఉదయం సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో 15మంది అరెస్ట్ చేశారు. అందులో 9మందిని 6 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఆ తర్వాత మరొకసారి మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఇప్పుడు తర్వాత అరెస్ట్ అయిన వారిని కస్టడీకి అనుమతించడంతో.. నిందితుల నుంచి ఆధారాలు సేకరించి వీటి వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు అని సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు.

Also Read..TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ లీక్ కేసులో నిందితుల రిమాండ్.. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కు యువతులతో సంబంధాలు

నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు.. సిట్ అధికారులు.. టీఎస్ పీఎస్ సీలో పని చేసే కొందరు ఉద్యోగులకు నోటీసులు ఇచ్చారు. గ్రూప్-1లో 100కు పైగా మార్కులు వచ్చిన వారిని కూడా సిట్ అధికారులు విచారించారు. వారి డేటాను కడా సేకరిస్తున్నారు.