TSRTC : మేడారం జాతరకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. నేరుగా వనదేవతల గద్దెల దగ్గరే దిగొచ్చు

ఆర్టీసీ బస్సులు ఎక్కితే నేరుగా సమ్మక్క-సారలమ్మ గద్దెల దగ్గరే దించుతామని చెప్పారు. అమ్మవార్ల దర్శనం తొందరగా అయ్యేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని పేర్కొన్నారు.

TSRTC : మేడారం జాతరకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. నేరుగా వనదేవతల గద్దెల దగ్గరే దిగొచ్చు

Medaram 11zon

special buses for Medaram fair : మేడారం జాతరకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. జాతరకు మొత్తం 3,845 ఆర్టీసీ బస్సు సర్వీసులను తిప్పనుంది. రాష్ట్రంలోని 51 పాయంట్స్ నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి. అంతేకాదు 30 మంది ఉంటే ప్రత్యేక బస్సును నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 523 బస్సులను 1,250 ట్రిప్పులను ఇప్పటివరకు ఆర్టీసీ నడిపినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులు ఎక్కితే నేరుగా సమ్మక్క-సారలమ్మ గద్దెల దగ్గరే దించుతామని చెప్పారు. అమ్మవార్ల దర్శనం తొందరగా అయ్యేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని పేర్కొన్నారు.

మేడారంలో 50 ఎకరాల్లో బేస్ క్యాంప్, తాత్కాలిక బస్టాండ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 7,400 మీటర్ల క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ చరిత్రలోనే తొలిసారి మేడారం జాతర కోసం ప్రత్యేక యాప్ ను రూపొందించామని వెల్లడించారు. మేడారం విత్ టీఎస్ఆర్టీసీ పేరుతో యాప్ ను ఆయన ఇవాళ లాంచ్ చేశారు. ఈ యాప్ లో ఆర్టీసీ సర్వీసులు, మేడారం జాతర విశిష్టతో పాటు ఇతర టూరిస్టు ప్రాంతాలు, ప్యాకేజీలతోపాటు ఎమర్జెన్సీ సర్వీసు నెంబర్లు, సమీపంలోని హోటల్స్ కంటాక్టులను ఉంచామని తెలిపారు.

World Cancer day : మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు ను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

వరంగల్ నుంచి 2 వేల బస్సుల్లో కండక్టర్లు లేకుండా సర్వీసులు నడిపిస్తున్నట్లు ఆయన తెలిపారు. మేడారంలో ఉచిత షటల్ సర్వీసులు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. మేడారం జాతరను ఆదాయం తెచ్చిపేట్టే జాతరగా కాకుండా ఒక సామాజిక సేవ, సామాజిక బాధ్యతగా ఆర్టీసీ భావించి, భక్తులకు సౌకర్యాలు కల్పిస్తుందని వివరించారు.

మేడారం జాతర ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీవరకు జరగుతుంది. మేడారం జాతర సందర్భంగా గతేడాది 19,09,838 మందిని వివిధ గమ్యస్ధానాలకు చేర్చామని సజ్జనార్ వివరించారు. ఈ ఏడాది ఇంతవరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 523 బస్సులను 1,250 ట్రిప్పులను మేడారానికి నడిపినట్లు తెలిపారు. ఈ నెల 13 నుంచి పెరిగే భక్తల రద్దీని తట్టుకునేందుకు బస్సులు సిద్ధం చేశామని చెప్పారు.