Watermelon Kills : తీవ్ర విషాదం.. పుచ్చకాయ తిని ఇద్దరు పిల్లలు మృతి.. ఆసుపత్రిలో తల్లిదండ్రులు..అసలేం జరిగిందంటే..

పెద్దపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పుచ్చకాయ తిన్న అన్నదమ్ములు మృతి చెందారు. మరో ముగ్గురు ఆసుపత్రిలో చావుతో పోరాడుతున్నారు. పుచ్చకాయ ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెబుతారు కదా.. మరి.. ఇలా జరిగిందేటి? పిల్లలు చనిపోయారని అంటున్నారేంటి అనే సందేహం వచ్చిందా? అసలేం జరిగిందంటే..

Watermelon Kills : తీవ్ర విషాదం.. పుచ్చకాయ తిని ఇద్దరు పిల్లలు మృతి.. ఆసుపత్రిలో తల్లిదండ్రులు..అసలేం జరిగిందంటే..

Watermelon Kills

Watermelon Kills : పెద్దపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పుచ్చకాయ తిన్న అన్నదమ్ములు మృతి చెందారు. మరో ముగ్గురు ఆసుపత్రిలో చావుతో పోరాడుతున్నారు. పుచ్చకాయ ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెబుతారు కదా.. మరి.. ఇలా జరిగిందేటి? పిల్లలు చనిపోయారని అంటున్నారేంటి అనే సందేహం వచ్చిందా? అసలేం జరిగిందంటే..

అంతర్గాం మండలం ఇస్సంపేట గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు సోమవారం(మార్చి 29,2021) పుచ్చకాయ తెచ్చుకున్నారు. అందులో సగం తిన్నారు. మిగతా భాగాన్ని అల్మరాలో పెట్టారు. ఆ తర్వాతి రోజు రాత్రి దాన్ని తిన్నారు. అంతే, ఒక్కసారిగా కలకలం రేగింది. అర్ధరాత్రి అంతా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే గ్రామంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందినా నయం కాకపోవడంతో గురువారం(ఏప్రిల్ 1,2021) కరీంనగర్‌ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం(ఏప్రిల్ 2,2021) తెల్లవారుజామున ఇద్దరు పిల్లలు(అన్నదమ్ములు) దారవేని శివానందు(12), చరణ్‌(10) మృతి చెందారు.

వారి తల్లిదండ్రులు శ్రీశైలం, గుణవతి, నానమ్మ సారమ్మలు ప్రాణాపాయస్థితిలో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పుచ్చకాయ తిని పిల్లలు చనిపోవడం వారి పెద్దలు ఆసుపత్రిలో చావుతో పోరాటం చేయడం స్థానికంగా సంచలనంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు ఈ మిస్టరీపై దర్యాఫ్తు చేపట్టారు. వారి అస్వస్థతకు గల కారణం గురించి ఆరా తీయగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఎలుకలను చంపే మందు వల్ల ఇదంతా జరిగిందని తెలిసి విస్తుపోయారు.

‘ఇంట్లో ఎలుకలను చంపేందుకు మందు తెచ్చారు. కొంత అక్కడక్కడా చల్లి, మిగిలిన ప్యాకెట్‌ను అల్మరాలో పెట్టారు. దాన్ని తిన్న ఎలుకలు ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ పుచ్చకాయపై తిరిగి కొంత తిన్నాయి. దీంతో అది విషంగా మారింది. ఇది గుర్తించని కుటుంబ సభ్యులు పుచ్చకాయను అలాగే తినడంతో అస్వస్థతకు గురయ్యారు’ అని పోలీసులు తెలిపారు. ఎలుకలను చంపేందుకు తెచ్చిన మందు… ఇంతటి ఘోరానికి దారితీస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇద్దరు పిల్లల మృతితో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.

సాధారణంగా ఇంట్లో ఎలుకల బాధ ఎక్కువగా ఉంటే, వాటిని చంపేందుకు ఎలుకల మందు తేవడం కామన్. అందరి ఇళ్లల్లోనూ ఇలానే చేస్తుంటారు. గదిలో ఏదో ఒక మూలన ర్యాట్ కిల్లర్ బిళ్లలు ఉంచుతారు. అవి తిని ఎలుకలు చచ్చిపోతాయి. అయితే, ఎలుక మందు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. పిల్లలు ఉన్న ఇళ్లలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎలుకల మందుని ఎక్కడపడితే అక్కడ ఉంచడం మంచిది కాదు. నిర్లక్ష్యం అనర్థాలకు దారితీస్తుంది. ఏ చిన్న పొరపాటు చేసినా భారీ మూల్యం తప్పదు. ఏకంగా ప్రాణాలే పణంగా పెట్టాల్సి వస్తుంది. ఆ కుటుంబసభ్యులు చేసిన చిన్న పొరపాటు వారి పిల్లల ప్రాణాలు పోవడానికి కారణమైంది.