Gajendra Singh Shekhawat : కేసీఆర్ వల్లే నూతన ట్రైబ్యునల్ ఆలస్యం : షెకావత్

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల కోసం నూతన ట్రిబ్యునల్ ఏర్పాటు ఆలస్యానికి కేసీఆరే కారణమని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు.

Gajendra Singh Shekhawat : కేసీఆర్ వల్లే నూతన ట్రైబ్యునల్ ఆలస్యం : షెకావత్

Gajendra Singh Shekavath

Gajendra Singh criticized CM KCR : తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల కోసం నూతన ట్రిబ్యునల్ ఏర్పాటు ఆలస్యానికి కేసీఆరే కారణమని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. కోర్టు కేసులతో కేసీఆరే ఆలస్యం చేశారని పేర్కొన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం మరుసటి రోజు సుప్రీంకోర్టు నుంచి కేసు వెనక్కి తీసుకుంటామని చెప్పి.. 8 నెలల సమయం తీసుకున్నారని గుర్తు చేశారు.

గత అక్టోబర్ లో పిటిషన్ ఉపసంహరణకి కోర్టు అనుమతించిన తరువాత తమ పని మొదలయ్యిందన్నారు. కేంద్రం తరపున భాధ్యతాయుతంగా తాము వ్యవహరిసస్తున్నా తమపై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై జరుగుతున్న దాడిగా చూడాలన్నారు. తనపై కేసీఆర్ విమర్శలు చేసారని..ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకే మీడియా ముందుకు వచ్చానని వెల్లడించారు.

YS Sharmila Deeksha : వైఎస్ షర్మిల 72 గంటల రైతు వేదన దీక్షకు అనుమతి నిరాకరణ

బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి నోటిఫికేషన్ అమలు గురించి డ్రామాగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ మాటలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని అన్నారు. నూతన ట్రిబ్యునల్ ఏర్పాటుపై న్యాయ శాఖ సలహా మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల కోసమే నూతన ట్రిబ్యునల్ ఉంటుందన్నారు. నూతన ట్రిబ్యునల్ వేయలా, ఉన్న ట్రిబ్యునల్ నే కొసాగించాలా అన్న అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. బోర్డుల పరిధి నోటిఫికేషన్ అమలుకు కట్ ఆఫ్ డేట్ లేదని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు.

TSRTC Charges : ఓ ట్విటర్‌ పోస్టు.. ఆర్టీసీ చార్జీలు తగ్గించింది

బోర్డుల పరిధి గెజిట్ నోటిఫికేషన్ అమలులోకి వస్తే ప్రాజెక్టుల నిర్వహణ సులభంగా ఉంటుందన్నారు. తెలుగు రాష్ట్రాలు నీటి ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించాలని చెప్పారు. నీటి పంపకాలు, విద్యుత్ అంశాలపై తెలుగు రాష్ట్రాల మధ్య గొడవలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

విభజన చట్టం ప్రకారమే బోర్డుల పరిధి నోటిఫై చేస్తూ నోటిఫికేషన్ జారీ అయ్యిందన్నారు. గెజిట్ నోటిఫికేషన్ లో ఎటువంటి సందేహాలు లేవన్నారు. డీపీఆర్ పేర్లతో తన దగ్గరకు వచ్చే పేపర్లను డీపీఆర్ లుగా పరిగణించలేమని చెప్పారు. సరైన ఫార్మాట్ లో డీపీఆర్ లు ఉండాలని చెప్పారు.