Gutka Groom : గుట్కా నములుతూ పెళ్లికొచ్చిన వరుడు..నాకొద్దు పొమ్మన్న వధువు

గుట్కా నములుతూ పెళ్లికి వచ్చిన వరుడిపై వధువు మండిపడింది. గుట్కా నమిలేవాడితోనే నేను పెళ్లి చేసుకోనని చెప్పి పెళ్లి మండపం నుంచి వెళ్లి పోయింది. దీంతో గుట్కా కాస్తా పెళ్లిని ఆపేసింది.

Gutka  Groom : గుట్కా నములుతూ పెళ్లికొచ్చిన వరుడు..నాకొద్దు పొమ్మన్న వధువు

Gutka Groom

UP Gutka groom : గుట్కా, పొగాకు నమిలితే..క్యాన్సర్ వస్తుందని ప్రాణాలకే ప్రమాదమని ఎంతగా చెబుతున్నా చాలామంది ఆ అలవాట్లు మానుకోలేకపోతున్నారు. కానీ గుట్కా నమిలే అలవాటు ఉన్నా..దానికో సమయం సందర్భం లేకుండా ఎక్కడ పడితే అక్కడా ఎలా పడితే అలా నమిలితే చూసేవాళ్లకు ఎంత రోతగా అనిపిస్తుందో తెలిసిందే. అటువంటిది ఏకంగా పెళ్లి చేసుకోవటానికి వచ్చిన వరుడే గాట్కా నములుతూ వస్తే మరి వధువు పరిస్థితి ఎలా ఉంటుంది? ఇదిగో ఇలాగే ఉంటుంది..పెళ్లి మండపానికి వచ్చిన వరుడు ఏమాత్రం బాధ్యత లేకుండా గుట్కా నములుతూ..వరెస్ట్ గా బిహేవ్ చేయటంతో వధువుకు ఒళ్లు మండింది. అంతే ఇలాంటి వాడు నాకు భర్తగా వద్దు అంటూ పెళ్లి క్యాన్సిల్ చేసి పారేసింది.దీంతో వరుడు తెల్లముఖం వేసి పెళ్లి చేసుకోకుండానే తిరిగి వెళ్లిపోయాడు తన బంధుమిత్ర పరివారంతో..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బాలియా జిల్లాలోని మిశ్రౌలి గ్రామానికి చెందిన ఓ యువ‌తికి కేజూరి గ్రామానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. పెళ్లి జూన్ 5న జరపాలని ముహూతర్తం కూడా పెట్టుకున్నారు. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి చేసుకోవటానికి వరుడు వధువు ఇంటికి ఊరేగింపుగా వచ్చాడు. అలా వస్తూ వస్తూ..వరుడు నోట్లో గుట్కా పెట్టుకుని నములుతూ వచ్చాడు. ఊరేగింపులో ఓకే..కానీ పెళ్లి మండపానికి కూడా గుట్కా వేసుకునే వచ్చాడు. ముహూర్తం దగ్గరపడుతున్నా..కనీసం నోరు శుభ్రం చేసుకుని రావాలనే జ్ఞానం కూడా లేకుండాపోయింది.

గుట్కా నములుతూ ఉన్న వరుడు కాస్తా వధువు కంటపడ్డాడు. అంతే ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో చిరాకుని అణచుకుని వరుడితో‘‘ గుట్కా న‌మ‌ల‌డం నాకు న‌చ్చ‌దని’ కానీ అతను ఏమాత్రం పట్టించుకోలేదు. నిర్లక్ష్యంగా అలాగే గుట్కా నములుతూ కూర్చున్నాడు. దాంతో గుట్కా నమిలేవాడిని నేను పెళ్లి చేసుకోను అని కచ్చితంగా చెప్పి పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయింది.అదే విషయాన్ని ఆమె తల్లిదండ్రులుతో కూడా చెప్పింది.

దీంతో ఇరు కుటుంబాలు వధువుకు నచ్చజెప్పే యత్నం చేశారు. కానీ వధువు వినలేదు. పెళ్లి చేసుకోబోయే కొంత సేపు అయినా గుట్కా నమలకుండా ఉన్నాడు అంటే దానికి అతను ఎంతగా అలవాటు పడి ఉంటాడు? ఇలాగైతే తరువాత తన పరిస్థితి ఏంటీ? అని ప్రశ్నించింది. దానికి ఎవ్వరి వద్దా సమాధానం లేదు. అప్పుడు కూడా వరుడు నేను గుట్కా మానేస్తాను అనిగానీ..చెప్పలేదు. దీంతో వధువు ‘గుట్కా నమిలేవాడు నాకు భర్తగా వద్దు’ అని కరాఖండీగా చెప్పేసరికి..పెళ్లికి ముందు ఇచ్చిపుచ్చుకున్న క‌ట్న‌కానుక‌ల‌ను తిరిగి ఇచ్చేశారు వరుడు తరపువారు. ఆ తరువాత బంధు మిత్రపరివారంగా పెళ్లి చేసుకోకుండానే తిరిగి వెళ్లిపోయారు.