Hanmakonda District : వరంగల్ అర్బన్ జిల్లా.. హన్మకొండ జిల్లాగా మార్పు

రంగల్ అర్బన్ జిల్లాను  హన్మకొండ జిల్లాగా మారుస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. రెండు రోజుల్లోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. వరంగల్‌లో కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది.

Hanmakonda District : వరంగల్ అర్బన్ జిల్లా.. హన్మకొండ జిల్లాగా మార్పు

Warangal Urban District To Be Changed As Hanmakonda District

Hanmakonda District : వరంగల్ అర్బన్  జిల్లాను  హన్మకొండ జిల్లాగా మారుస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. రెండు రోజుల్లోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. వరంగల్‌లో కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా సోమవారం (జూన్ 21) సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. 6.73 ఎకరాల స్థలంలో కలెక్టరేట్ నిర్మాణం చేపట్టగా.. రూ.57 కోట్లతో అధునాతన సాంకేతికతతో కలెక్టరేట్ కాంప్లెక్స్ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లో ఒకే చోట 34 శాఖల కార్యాలయాలు ఉంటాయి.

రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. వరంగల్‌లో అధునాతన కలెక్టరేట్‌ను ప్రారంభించామని కేసీఆర్ తెలిపారు. పనులు ఆలస్యం కాకుండా వేగంగా జరగాలన్నారు. వరంగల్‌కు వెటర్నరీ కాలేజీ మంజూరు చేస్తున్నామని చెప్పారు. త్వరలో వరంగల్‌కు కొత్త కలెక్టరేట్ రానున్నట్టు తెలిపారు. బ్రిటిష్ కాలంలో కలెక్టర్ అని పేరు పెట్టారని, బ్రిటీష్ కాలంలో పెట్టిన పేరు కూడా మారాలని కేసీఆర్ అన్నారు. కొత్త కలెక్టరేట్ ను ఇంకా ఆధునతనంగా తీర్చిదిద్దాలని తెలిపారు. ధరణి పోర్టల్ తో భూ సమస్యలు తీరాయని చెప్పారు. వరంగల్ పరిశ్రమల కేంద్రం కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్‌, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానికుల విజ్ఞ‌ప్తుల మేర‌కు వ‌రంగ‌ల్ అర్బన్  జిల్లా పేరును హ‌న్మ‌కొండ జిల్లాగా మార్చుతామ‌ని కేసీఆర్ తెలిపారు. వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం ప్రారంభం సంద‌ర్భంగా కేసీఆర్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఈ క‌లెక్ట‌రేట్ భ‌వ‌నాన్ని హ‌న్మ‌కొండ జిల్లాగా ప‌రిగ‌ణించాలన్నారు.  త్వరలో నిర్మించ‌బోయే క‌లెక్ట‌రేట్‌ను వ‌రంగ‌ల్ క‌లెక్ట‌రేట్‌గా ప‌రిగ‌ణించాలని తెలిపారు. జిల్లా పేరు మార్పున‌కు సంబంధించిన ఉత్త‌ర్వులు రెండు రోజుల్లోనే వ‌స్తాయ‌ని కేసీఆర్ స్పష్టం చేశారు.

వరంగల్ కు డెంటల్ కాలేజీతో పాటు ఆస్పత్రి మంజూరు చేసినట్టు తెలిపారు. వరంగల్ మెడికల్ హబ్‌గా మారాలన్నారు. హైదరాబాద్ లోని వాళ్లు ఈర్ష్య పడేలా ఆస్పత్రులు రావాలని చెప్పారు. జైలు కూల్చితే నాకైమైనా వస్తుందా? దానిపైనా విమర్శలు చేశారని తెలిపారు. సమాజంపై అందరికీ బాధ్యత ఉండాలని తెలిపారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడటం సరికాదన్నారు. కరోనా థర్డ్ వేవ్, ఫంగస్ లపై దుష్ప్రచారం చేయకండని కేసీఆర్ సూచించారు.

నాకు కరోనా వచ్చినా కేవలం పారాసిటమాల్ మాత్రమే వేసుకున్నానని తెలిపారు. కరోనాపై అనవసరంగా భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్లో లేనిపోని ఆందోళనలు సృష్టిస్తున్నారని తెలిపారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులు ఎప్పుడైనా ఖాళీగా ఉంటాయని ప్రశ్నించారు. క్లిష్ట పరిస్థితుల్లో వైద్యులు సేవ చేస్తున్నారని, వారిపై దాడులు చేయడం సరికాదన్నారు.

పనులు అన్ని చకచకా జరగాలన్నారు. రిజిస్ట్రేషన్ల కోసం గతంలో చాలా ఇబ్బందులు ఉండేవన్నారు. ఇబ్బంది లేకుండా సుమారు 6 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయని చెప్పారు. వైద్యం కోసం హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లాకు వచ్చే పరిస్థితి రావాలన్నారు. హెల్త్ యూనివర్శిటీని వరంగల్ లోనే పెట్టామన్నారు. వరంగల్‌లో అద్భుతమైన హైవేలు, రైల్వే జంక్షన్ ఉన్నాయని తెలిపారు. మాతా, శిశు సంరక్షణ చాలా అవసరమని చెప్పారు.

ఏడాదిన్నరలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ అనాగరికంగా ఉండటానికి వీల్లేదన్నారు. హైదరాబాద్ లోని వాళ్లు ఈర్ష పడేలా ఆస్పత్రులు రావాలని ఆకాంక్షించారు. జైలు కూల్చితే నాకైమనా వస్తుందా? దానిపైనా విమర్శలు చేశారని కేసీఆర్ తెలిపారు. సమాజంపై అందరికీ బాధ్యత ఉండాలని చెప్పారు. బాధితులకు కిట్లు, మందులు అందించారని చెప్పారు. కరోనా థర్డ్ వేవ్, ఫంగస్ లపై దుష్ప్రచారం చేయకండని కేసీఆర్ తెలిపారు.