Telangana : వాతావరణం : నేడు, రేపు ఓ మాదిరి వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, 5.9 కిలోమీటర్ల ఎత్తులో గాలులతో ఉపరితల ద్రోణి ఉందని..దీని కారణంగా..2021, జూలై 03వ తేదీ శనివారం, 04వ తేదీ ఆదివారం ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Telangana : వాతావరణం : నేడు, రేపు ఓ మాదిరి వర్షాలు

Tg Rain

Weather Report : తెలంగాణ రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, 5.9 కిలోమీటర్ల ఎత్తులో గాలులతో ఉపరితల ద్రోణి ఉందని..దీని కారణంగా..2021, జూలై 03వ తేదీ శనివారం, 04వ తేదీ ఆదివారం ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉరుములు, మెరుపులు, గాలులతో ఒక మాదిరి వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. గురువారం ఉదయం 08 నుంచి శుక్రవారం రాత్రి 08 గంటల వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయని, అత్యధికంగా మహబూబాబాద్, బయ్యారంలో 11 సెంటీమీటర్ల వర్షం కురిసిందన్నారు.

మెదక్ (దొంగల ధర్మారం 10.7, కొమరం భీం (దహేగాం)లో 10, మెదక్, బూర్గుంపాడులో 09. జగిత్యాల (పెగడ)లో 08, ఇల్లెందులో 08 సెంటిమీటర్ల వర్షం కురిసిందన్నారు. వర్షాలు కురవడంతో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి. శుక్రవారం పగలు అత్యధికంగా భద్రాచలంలో 27.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.