Huzurabad : హుజూరాబాద్‌ లో గెలుపెవరిది..?

హుజూరాబాద్‌లో పోలింగ్‌ ముగిసింది. ఇక ఫలితమే మిగిలి ఉంది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తడంతో భారీగా ఓటింగ్ నమోదైంది.

Huzurabad : హుజూరాబాద్‌ లో గెలుపెవరిది..?

Huzurabad (3)

Huzurabad bypoll : హుజూరాబాద్‌లో పోలింగ్‌ ముగిసింది. ఇక ఫలితమే మిగిలి ఉంది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తడంతో.. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా ఓటింగ్‌ నమోదైంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 84 శాతం పైగా పోలింగ్‌ నమోదవగా ఈ సారి అది 86.57 శాతానికి పెరిగింది. 2.5 శాతం పైగా పెరుగుదల నమోదైంది. కరీంనగర్‌లోని ఎస్‌.ఆర్‌.ఆర్‌.డిగ్రీ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచారు. మంగళవారం ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడవనున్నాయి.

మరోవైపు.. హుజూరాబాద్‌ బైపోల్‌పై ఎగ్జిట్ పోల్స్‌ హీట్‌ పెంచేస్తున్నాయి. టీఆర్ఎస్.. బీజేపీ.. కాంగ్రెస్ సహా 35 మంది అభ్యర్థులు హుజూరాబాద్‌ బరిలో నిలిచారు. అయితే ప్రధాన పోటీ మాత్రం.. టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే నెలకొంది. ఎగ్జిట్‌ పోల్స్‌లో కూడా టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని కొన్ని సర్వేలు చెబుతుంటే.. మరికొన్ని సర్వేలు ఈటలదే విజయమంటున్నాయి.

Complaint On Etala : ఈటలపై ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ నేతలు

ఈవీఎంల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాల నిఘాలో స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో భద్రత కల్పించినట్లు పేర్కొన్నారు.. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌. అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌ సీల్‌ చేశామని, కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీస్‌లు భద్రతను పర్యవేక్షిస్తున్నారన్నారు. ఎన్నికల సందర్భంగా డబ్బు పంపకాలు, ప్రలోభాలకు సంబంధించి ఇప్పటివరకు సుమారు 85 ఫిర్యాదులు వచ్చాయని, చర్యలు తీసుకుంటామని చెప్పారు.

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. గెలుపు తమదంటే తమదేనంటున్నారు టీఆర్ఎస్‌-బీజేపీ నేతలు. ఉప ఎన్నికలో గొప్ప విజయం సాధించబోతున్నామన్నారు మంత్రి హరీశ్‌రావు. హుజూరాబాద్‌ ఓటర్లు చైతన్యం చాటారన్నారు. సీఎం కేసీఆర్‌ మార్గదర్శకం, ప్రజల ఆశీస్సులతో విజయం సాధిస్తామన్నారు హరీశ్‌రావు. గత 4 నెలలుగా పార్టీ విజయం కోసం కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారన్నారు. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు సహకరించిన పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు.

Telugu States Bypoll : హుజూరాబాద్, బద్వేల్‌‌లో పోలింగ్ సమాప్తం

అటు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కూడా గెలుపు తనదేనంటున్నారు. ప్రజలు ధర్మాన్ని కాపాడుకున్నారన్నారు. చైతన్యవంతమైన హుజూరాబాద్‌ గడ్డ ప్రజలు తనపై జరిగిన కుట్రలను అడ్డుకోవడంలో సఫలమయ్యారన్నారు. అధికారపార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజాస్వామ్యాన్నే గెలిపించబోతున్నారన్నారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఉప ఎన్నికలో తన గెలుపు ఖాయమైపోయిందన్నారు.

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అప్రజాస్వామికంగా వ్యవహరించిదని.. ఆరోపించారు. ప్రజలు నిష్పక్షపాతంగా న్యాయం, ధర్మం వైపు నిలిచారని పేర్కొన్నారు. బీజేపీ విజయం కోసం కృషి చేసిన శ్రేణులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు బండి సంజయ్‌. సీఎం అహంకారానికి, హుజూరాబాద్‌ ప్రజల ఆత్మగౌరవానికి జరిగిన పోటీలో ప్రజలు మంచి ఆలోచనతో బీజేపీని ఆదరించారని బండి సంజయ్ అన్నారు.