YS Sharmila : నాకు, మా అన్నకు విభేదాలు లేవు

తెలంగాణలో  ప్రజల బాగోగుల కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ  పెట్టామని ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చెప్పారు.

YS Sharmila : నాకు, మా అన్నకు విభేదాలు లేవు

Ys Sharmila

YS Sharmila :  తెలంగాణలో  ప్రజల బాగోగుల కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ  పెట్టామని ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు అన్యాయం జరుగుతోందని… ఏడెళ్లుగా కేసీఆర్ పాలన చూసామని ఆయన సాధించిందేమీ లేదని, ఏడెళ్లుగా నిరుద్యోగం నాలుగింతలు పెరిగిందని  ఆమె ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు వైఎస్సార్ పెద్దపీట వేశారని ఆమె చెప్పారు.  సింహం సోలోగా ఉందని భయపడదు అని వ్యాఖ్యానిస్తూ …నేను ఒంటరిని కదా అని నాకెప్పుడూ భయం  లేదు…. కోట్ల కొలది తెలుగు ప్రజల హృదయాల్లో వైఎస్సార్ ఇంకా బతికే  ఉన్నారని… వారి అభిమానులే నాకు కొండంత అండ అని ఆమె చెప్పారు.

తెలంగాణ ప్రజలకు వైఎస్సార్ పెద్దపీట వేశారని ఆమె చెప్పారు.  రాష్ట్రంలో ప్రజలకు అన్యాయం జరుగుతోందని… కోట్ల కొలది రూపాయలు అప్పులు తెచ్చి ప్రభుత్వం ఏమీ చేసిందో చెప్పాలని ఒక్కరికి ఇల్లు కట్టి ఇవ్వలేదని… ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా అని ఆమె ప్రశ్నించారు. తెచ్చిన అప్పులు ఎవరి జేబులోకి వెళ్లాయని ఆమె అడిగారు.

కేసీఆర్ కు   ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ చీఫ్ మినిస్టర్‌గా ఫెయిలయ్యారని షర్మిల ఆరోపించారు. కేసీఆర్ నిరుద్యోగులకు అన్యాయం చేశారు కాబ్టటే రాష్ట్రంలోని 54 లక్షలమంది నిరుద్యోగులే ప్రభుత్వానికే దరఖాస్తు చేసుకున్నారమని ఆమె అన్నారు. దరఖాస్తు చేసుకున్నవారే 54 లక్షల మంది ఉంటే , చేసుకోని నిరుద్యోగులు ఇంకెంతమంది ఉన్నారో అని ఆమె అన్నారు.

కేసీఆర్ బాత్రూం లు కూడా బుల్లెట్ ప్రూఫ్ చేయించుకున్నారని ఆమె తెలిపారు. ఉపాధిలేక నిరుద్యోగులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. కేసీఆర్ ది గుండె..బండా అని ఆమె అన్నారు. రైతుల ఆత్మహత్యల్లోకూడా రాష్ట్రం దేశంలో మొదటి స్ధానంలో ఉందని.. ఇక్కడ ప్రజలకు ఇంకో పార్టీ అవసరం కాబట్టి పార్టీ పెట్టామని…ప్రజలుకు పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి పార్టీ పెట్టామని అన్నారు.

నాకు పదవి రాలేదనో,ఇంకేదో కారణంతోనో పార్టీ పెట్టలేదని…. కేవలం ప్రజలకోసమే పార్టీ పెట్టానని ఆమె వివరించారు. మహానేత పేరు పెట్టుకుని పార్టీ పెట్టామని… మహానేత ఆశయాల కోసం పెట్టామని.. ఎవరిమీదో అలిగి పార్టీ పెట్టలేదని ఆమె వివరించారు. నాకు  జెంపింగ్ జపాంగ్ లు అక్కర్లేదని నిఖార్సైన నాయకులు నాకు కావాలాని ఆమె చెప్పారు.