Backyard Chickens : వ్యవసాయానికి అనుబంధంగా పెరటికోళ్ల పెంపకం

Backyard Chickens : పెరటి కోళ్లు అంటే పెరట్లో పెంచుకునే సాధారణ కోళ్ల జాతులు. జాతే మాంసోత్పత్తి, గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం తక్కువ వుండటంతో నాటుకోళ్లతో సంకర పరిచి అభివృద్ధి చేసిన అనేక సంకరజాతి కోళ్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసారు.

Backyard Chickens : వ్యవసాయానికి అనుబంధంగా పెరటికోళ్ల పెంపకం

backyard chicken farming

Backyard Chickens : వ్యవసాయం, పాడి.. తరువాత స్థానం పెరటి కోళ్ల పెంపకానిది. గ్రామీణుల ఆదాయాన్ని పెంచే విషయాల్లో తొలుత చెప్పుకునేది పెరటి కోళ్ల పెంపకమే. దేశవాళీ కోళ్ల పెంపకం ద్వారా మంచి ఆర్థిక పరిపుష్టి సాధించవచ్చు. ఉత్పత్తి సామర్థ్యం ఎక్కువగా ఉండే కోళ్లను ఇంటి పరిసరాల్లో పెంచుకోవచ్చు. అలాంటి కోళ్లను.. వ్యవసాయంతో పాటు తక్కువ పెట్టుబడితో పెంచి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతు.

పెరటి కోళ్లు అంటే పెరట్లో పెంచుకునే సాధారణ కోళ్ల జాతులు. నాటుకోళ్లు మనందరికీ ఇష్టమైన జాతే అయినా… వీటిలో మాంసోత్పత్తి, గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం తక్కువ వుండటంతో నాటుకోళ్లతో సంకర పరిచి అభివృద్ధి చేసిన అనేక సంకరజాతి కోళ్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసారు. పూర్తిగా నాటుకోళ్లను పోలిన ఈ కోళ్లు అధిక గుడ్ల దిగుబడితోపాటు, కొన్ని జాతుల్లో మాంసోత్పత్తి అధికంగా వుంది.

నాటు కోళ్లు ఆకర్షణీయమైన రంగుల్లో ఉంటాయి. కాళ్లు బలంగా, ధృడంగా ఉండి వేగంగా పరిగెత్తడానికి అనువుగా ఉంటాయి. అయితే  వీటి శరీర బరువు పుంజుల్లో 2.5 నుండి 3.5 కిలోల వరకు, పెట్టలు 1.5 నుంచి 1.8 కిలోల మాత్రమే బరువు వుంటాయి.  ఫారమ్‌ కోళ్ల కంటే పెరటి కోడి మాంసం ఎక్కువగా రావడమే కాకుండా రుచిగా కూడా ఉంటుంది. వీటికి ప్రత్యేకంగా మేత వేయాల్సిన అవసరం కూడా ఉండదు. వ్యవసాయ వ్యర్థాలను మేతగా వేస్తే సరిపోతుంది.

వ్యవసాయంతో పాటు పెరటికోళ్ల పెంపకం – తక్కువ సమయం.. :
ఆరు బయట తిరుగుతూ ఆహారాన్ని గ్రహించడం వలన వీటిలో కొవ్వు శాతం తక్కువగా ఉండి ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. అందుకే కామారెడ్డి జిల్లా, బాల్కండ మండలం, చింతనాగారానికి చెందిన రైతు అశోక్ రెడ్డి వ్యవసాయంతో పాటు పెరటికోళ్ల పెంపకాన్ని చేపట్టారు. తన పంట పొలాలనుండి వచ్చిన ఉత్పత్తులను వీటికి దాణాగా వేస్తూ.. పెంపకం చేపడుతున్నారు.

కోళ్లనుండి వచ్చిన వ్యర్థాలను పంట పొలానికి వాడుతూ.. పెట్టుబడిని తగ్గించుకుంటున్నారు. మొత్తం మీద పెరటి కోళ్ల పెంపకంతో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందవచ్చని నిరూపిస్తున్నారు. రైతు అశోక్ రెడ్డి పెంచుతున్న కోళ్లను చూసి చుట్టుప్రక్కల రైతులు అభినందిస్తున్నారు. ఒక పక్క వ్యవసాయం చేస్తూనే.. మరోపక్క కోళ్ల పెంపకంపై ఆదాయాన్ని పొందుతుండంతో.. తోటి రైతులు కూడా వీటి పెంపకంపట్ల మక్కువ చూపుతున్నారు.

25 ఎకరాల్లో వ్యవసాయం : 
అనుబంధంగా కోళ్ల పెంపకం
5 గుంటల భూమిలో షెడ్ ఏర్పాటు
మొత్తం 400 కోళ్లు

ఒక్కో కోడి పిల్ల ధర రూ. 45
మొదటి బ్యాచ్ 200 కోళ్లు
ప్రస్తుతం 400 కోళ్లు

వచ్చేసారి 600 కోళ్లు పెంపకం
ఒక్కో కోడి బరువు 2 కి.
ఏడాది క్రితం పెంపకం ప్రారంభం
ప్రస్తుతం రెండో బ్యాచ్
3 నెలల్లో నికర ఆదాయం రూ. 1 లక్ష
కోళ్ల వ్యర్థాలను పంటలకు

పెరటికోళ్ల పెంపకం
రిటైల్ ధర కిలో రూ. 300
హోల్ సేల్ ధర కిలో రూ. 250

పెరటికోళ్ల పెంపకం
ఒక్కో కోడిపై  ఆదాయం రూ. 500
ఒక్కో కోడిపై నికర ఆదాయం రూ. 200