Chakkarakeli Banana : ఎకరంలో చక్కరకేళి అరటి సాగు

Chakkarakeli Banana : ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లా, కాజాపడమర గ్రామానికి చెందిన రైతు ఎకరంలో చక్కరకేళి అరటిని సాగుచేస్తూ.. మంచి లాభాలు పొందేందుకు సిద్ధమయ్యారు.

Chakkarakeli Banana : ఎకరంలో చక్కరకేళి అరటి సాగు

Chakkarakeli Banana Farming

Chakkarakeli Banana : ఉద్యానవన పంటల్లో ప్రధానమైంది అరటి. ఏ సీజన్‌లోనైనా అరటి పండ్లకు మంచి గిరాకీ ఉంటుంది. పైగా ఈ పంటను ఏ సీజన్‌లోనైనా సాగు చేసుకోవచ్చు. అందుకే తూర్పుగోదావరి జిల్లాలో చాలా మంది రైతులు ఇతర పంటలతో పాటు విధిగా కొంత విస్తీర్ణంలో అరటిని సాగుచేస్తుంటారు. ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లా, కాజాపడమర గ్రామానికి చెందిన రైతు ఎకరంలో చక్కరకేళి అరటిని సాగుచేస్తూ.. మంచి లాభాలు పొందేందుకు సిద్ధమయ్యారు.

Read Also : Solar Power Cultivation : సోలార్ విద్యుత్‎తో పంటల సాగు

అరటి అమృత ఫలం.. అన్ని వయసులవారు తినే పండు ఇది.. అన్ని కాలాల్లోనూ లభిస్తుంది. అరటిపంటకు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని నిలబడే శక్తి తక్కువ. అందుకే ఈ పంటను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఏడాది పాటు ఉండే ఈ పంటకు పెట్టుబడులు కూడా అధికమే. అయినా సరే రైతులు ఈ పంటను విధిగా సాగుచేస్తుంటారు. ఇందుకు నిదర్శనమే పశ్చిమగోదావరి జిల్లా, యలమంచిలి మండలం, కాజా పడమర గ్రామానికి చెందిన రైతు గుబ్బల రామారావు.

తనకున్న ఎకరం కొబ్బరి తోటలో అంతర పంటగా చక్కరకేళి రకం అరటిని సాగుచేస్తున్నారు. పంట చేతికొచ్చే దశలో ఉంది. గెలలు కూడా నాణ్యంగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని గెలలను నరికేసి మార్కెట్ చేశారు. ఈ పంట అయిపోగానే పిలక తోట వస్తుంది. దీనికి పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. ఒకసారి పెట్టుబడి పెట్టి.. జాగ్రత్తగా చూసుకుంటే.. రెండేళ్ల పాటు లాభాలు పొందవచ్చిన చెబుతున్నారు రైతు.

Read Also : Green Black Gram Cultivation : వేసవి పెసర, మినుము సాగు యాజమాన్యం