Paddy Crop : వరిలో కాండం తొలుచుపురుగుల ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు 

Paddy Crop : తెలుగు రాష్ట్రాల్లో నీటి వసతి ఉన్నచోట రైతులు వరి సాగు చేశారు. వరిపైరు వివిధ దశల్లో ఉంది. ముందుగా వేసిన చోట పూత దశలో ఉండగా.. మరికొన్ని చోట్ల పిలక దుబ్బు దశ నుండి చిరుపొట్ట దశలో ఉంది.

Paddy Crop : వరిలో కాండం తొలుచుపురుగుల ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు 

Control Stem Borer in Rice Crop

Updated On : September 22, 2024 / 3:00 PM IST

Paddy Crop : ఈ ఏడాది వర్షాలు ఆలస్యమయ్యాయి. వరినాట్లు కూడా ఆలస్యంగానే వేశారు రైతులు. ప్రస్తుతం దుబ్బుచేసే దశ నుండి చిరుపొట్ట దశవరకు వరిపైర్లు ఉన్నాయి. అయితే గత యాసంగి లాగే ఈ సారి కూడా వరిపంటకు కాండంతోలుచుపురుగుల బెడద ఎక్కువైంది. వీటిని సకాలంలో అరికట్టకపోతే తీవ్రనష్టం వాటిల్లే ప్రమాదముందని సమగ్ర సస్యరక్షణ చర్యలు తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు.

తెలుగు రాష్ట్రాల్లో నీటి వసతి ఉన్నచోట రైతులు వరి సాగు చేశారు. వరిపైరు వివిధ దశల్లో ఉంది. ముందుగా వేసిన చోట పూత దశలో ఉండగా.. మరికొన్ని చోట్ల పిలక దుబ్బు దశ నుండి చిరుపొట్ట దశలో ఉంది. వరి పైరులో కాండం తొలుచు పురుగు నారుమడిదశ నుంచి పైరు కంకివేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశిస్తుంది.

ఈ పురుగును  సకాలంలో నివారించకపోతే 20 నుండి 30 శాతం దిగుబడులను రైతులు నష్టపోవాల్సి వస్తుందంటూ వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా , బెల్లంపల్లి, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు.

Read Also : Rajma Farming : రాజ్మా సాగు.. అధిక దిగుబడులకు పాటించాల్సిన యాజమాన్యం