Rajma Farming : రాజ్మా సాగు.. అధిక దిగుబడులకు పాటించాల్సిన యాజమాన్యం
Rajma Farming : శీతాకాలంలో పండించే కూరగాయల్లో రాజ్మా ఒకటి. వీటినే ప్రెంచి చిక్కుడు అంటారు. అధికంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన రైతులు ముందస్తు రబీ పంటగా సాగుచేస్తుంటారు.

Rajma Farming
Rajma Farming : రాజ్మా చిక్కుళ్లు విత్తుకునేందుకు ఈ నెల చివరి వరకు సమయం ఉడటంతో.. విశాఖ ఏజెన్సీ రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే విత్తిన రైతుల పొలాల్లో మొలకలు వచ్చాయి. మరికొంత మంది దుక్కులను సిద్ధం చేస్తున్నారు. అయితే అధిక దిగుబడినిచ్చే రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులు చేపడితే.. అధిక దిగుబడులు పొందే ఆస్కారం ఉందని రైతులకు తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా, ఆముదాల వలస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. ఉమా మహేశ్వరరావు.
Read Also : Agriculture Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న యువకుడు
శీతాకాలంలో పండించే కూరగాయల్లో రాజ్మా ఒకటి. వీటినే ప్రెంచి చిక్కుడు అంటారు. అధికంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన రైతులు ముందస్తు రబీ పంటగా సాగుచేస్తుంటారు. అయితే గతంలో పాడేరు, రంపచోడవరం ఐటీడీఏల పరిధిలో దాదాపు 20 వేల హెక్టారుల్లో రాజ్‌మాను రైతులు సాగుచేసేవారు. కాలక్రమంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు, నాణ్యమైన విత్తనం కొరత కారణంగా సాగు విస్తీర్ణం పడిపోయింది. ప్రస్తుతం కొద్ది విస్తీర్ణంలో మాత్రమే ఆదివాసీ రైతులు రాజ్‌మా పంటను సాగు చేస్తున్నారు.
రాజ్‌మాకు అంతర్జాతీయ మార్కెట్‌లో అత్యధిక గిరాకీ వుంది. జిల్లాలో పండించిన రాజ్‌మా 60 శాతం ఉత్తర భారతదేశానికి ఎగుమతి అవుతుంది. కిలో రాజ్‌మాకు రైతులకు రూ.60 నుంచి రూ.70 ధర లభిస్తుంది. రాజ్‌మాను ఆగస్టు నెలాఖరు నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు విత్తుకోవచ్చు.
అయితే, ఆయా ప్రాంతాలకు అనువైన అధిక దిగుబడినిచ్చే రకాల ఎంపికతో పాటు, సాగులో మేలైన యాజమాన్యం పాటిస్తేనే నాణ్యమైన దిగుబడులను పొందేదుకు వీలుంటుంది. మరిన్ని విషయాలు విశాఖ జిల్లా, ఆముదాల వలస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. ఉమా మహేశ్వరరావు ద్వారా తెలుసుకుందాం..
విత్తన ఎంపిక ఒకటే సరిపోదు.. పంట ఎదుగుదలలో ఆశించే చీడపీడలను అరికట్టాలంటే విత్తన శుద్ధి తప్పని సరిచేసుకోవాలి. అంతే కాదు అధిక దిగుబడులను పొందాలంటే సమయానుకూలంగా, సిఫార్సు మేరకు ఎరువుల యాజమాన్యం చేపట్టాలి.
Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు