EC Poultry Farm : ఈసీ పౌల్ట్రీలో రిస్క్ తక్కువ.. లక్షల్లో ఆదాయం
EC Poultry Farm : వ్యవసాయ అనుబంధ రంగమైన కోళ్ళ పెంపకంలోకి యువత రావడం రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా బ్రాయిలర్ కోళ్ళ పెంపకంలో లాభాలతో పాటు ఒక్కోసారి భారీ స్థాయిలో నష్టాలూ కూడా వస్తుంటాయి.

EC Poultry Farm
EC Poultry Farm : కోళ్ల ఫారాల్లో అధిక లాభాలు ఆర్జించేందుకు రైతులు అధునాత టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగి బ్రాయిలర్ కోళ్ళు చనిపోతున్నాయి. ఈ నేపధ్యంలోనే పౌల్ట్రీ రైతులు ఈసీ కోళ్ల ఫారాల వైపు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా మంది రైతులు ఈసి ఫాంలు నెలకొల్పి మంచి ఆదాయం పొందుతున్నారు. ఈ కోవలోనే కడప జిల్లాకు చెందిన ఓ యువకుడు ఎకరంలో ఈసీ పౌల్ట్రీఫాం ఏర్పాటు చేసుకొని లాభాల బాట పడుతున్నారు.
వ్యవసాయ అనుబంధ రంగమైన కోళ్ళ పెంపకంలోకి యువత రావడం రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా బ్రాయిలర్ కోళ్ళ పెంపకంలో లాభాలతో పాటు ఒక్కోసారి భారీ స్థాయిలో నష్టాలూ కూడా వస్తుంటాయి. సాధారణ షెడ్లలో కోడి పిల్లలను పెంచుతుంటారు. అందువల్ల బయటి ఉష్ణోగ్రతల ప్రభావం కోడి పిల్లల ఆరోగ్యం, ఎదుగుదల మీద పడుతుంది. వేడి ఎక్కువగా ఉంటే కోడి పిల్లలు దాణా తీసుకోవడం తగ్గిస్తాయి. దీంతో వాటి ఆరోగ్యం దెబ్బతింటుంది.
ఫలితంగా బాయిలర్స్ బరువు పెరగవు. లేయర్స్ అయితే తక్కువ గుడ్లు పెడతాయి. దీని కారణంగా ఉష్ణోగ్రతలు ఎక్కువ, తక్కువ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈసి షెడ్ లను నిర్మిస్తున్నారు రైతులు . ఈసి అంటే ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ సిస్టం అన్నమాట. ఇలాంటి ఓ షెడ్ ను ఏడాది క్రితం ఏర్పాటు చేసి అశోక్ అగ్రో పార్మ్ పేరుతో బ్రాయిలర్ కోళ్ళను పెంచుతున్నారు కడప జిల్లా, బ్రహ్మంగారి మఠం మండలం , ముడుమాలా గ్రామానికి చెందిన రైతు దిలీప్ రెడ్డి.
ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ టెక్నాలజీ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇందులో కోళ్లు బాగా ఎదుగుతాయి. పెద్దగా పని వాళ్లు అవసరం ఉండదు. సాధారణ కోళ్ల ఫారంలో 10 వేల కోళ్లను పెంచితే.. ఈసీ కోళ్ల ఫారాల్లో 25 వేల కోళ్లను పెంచవచ్చు. సాధారణ కోళ్ల ఫారాల్లో 45 నుంచి 50 రోజుల వరకు కోళ్లు తగినతం బరువు పెరగవు. ఈసీ షెడ్లలో 32 నుంచి 35 రోజుల్లోపే రెండు కిలోలకుపైగా వస్తాయి. నిర్వహణ వ్యయం తగ్గడంతో లాభాలు ఎక్కువగా ఉంటాయి. కోడి పిల్లలు చనిపోవడం చాలా తక్కువగా ఉంటుంది.
Read Also : Dairy Farm : గేదెల డెయిరీతో ఆదర్శంగా నిలుస్తున్న పశ్చిమగోదావరి జిల్లా రైతు