తిరుమల శ్రీవారి ప్రసాదానికి సిక్కోలు సేంద్రియ బెల్లం.. లాభాలే లాభాలంటున్న రైతులు
ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన చెరకు నుంచి వండిన బెల్లాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం తయారీకి బెల్లం తీసుకునేందుకు టీటీడీ కూడా అంగీకరించింది.

Farmers Supplying Jaggery
రసాయన ఎరువులు, పురుగుమందుల లేని పంటల సాగు విస్తరిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల రైతులు సేంద్రీయ సాగు విధానాలు, సమగ్ర వ్యవసాయ పద్ధతులు అనుసరిస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు రైతులు ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీకి బెల్లం, సరఫరా చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు
శ్రీకాకుళం జిల్లా, ఆముదాల వలస మండలం, నిమ్మతొర్లవాడ గ్రామంలో అనేక మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. సేంద్రీయ విధానాలను అనుసరించే.. ధాన్యం, మొక్కజొన్న, చెరకు.. ఇలా ఆహార పంటలతో పాటు ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. జిల్లాలో ఏటా ఈ విధానం పెరుగుతున్నా.. సేంద్రీయ పంట ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయం లేకపోవటం రైతులను నిరాశకు గురిచేస్తోంది. ఈ పరిస్థితుల్లో విజయనగరం జిల్లా ప్రకృతి విభాగం అధికారులు.. తిరుమల తిరుపతి దేవస్థానంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు.
ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన చెరకు నుంచి వండిన బెల్లాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం తయారీకి బెల్లం తీసుకునేందుకు టీటీడీ కూడా అంగీకరించింది. ఈ మేరకు గత సంవత్సరం రైతు నక్క చిరంజీవి రావు ప్రకృతి విధానంలో వండిన బెల్లాన్ని పంపారు. ఈ ఏడాది దాదాపు 120 టన్నుల బెల్లాన్ని టీటీడి ఆర్డర్ ఇచ్చింది. ఇందుకోసం చాలా మంది రైతులు బెల్లాన్ని వండుతున్నారు. ఇప్పటికే 50 టన్నుల బెల్లం సిద్ధం చేశారు. తమ పంటలను టీటీడీ ప్రసాదానికి ఇవ్వటాన్ని రైతులు అదృష్టంగా భావిస్తున్నారు.
బెల్లం తయారీ చాలా శ్రమతో కూడుకున్న పని .. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న బెల్లం నాణ్యత దెబ్బతిని ఎందుకూ పనికి రాకుండా పోతుంది. అంతే కాదు వాతావరణం అనుకూలిస్తేనే మంచి దిగుబడి వచ్చి గిట్టుబాటవుతుంది. గతంలో నాణ్యమైన బెల్లం అందిస్తున్నా మార్కెటింగ్ సదుపాయం లేకపోయేది. ప్రస్తుతం టీటీడి వారి ఒప్పందంతో ఇక్కడి రైతులు మంచి లాభాలను పొందుతున్నారు.
గతంలో ప్రకృతి, సేంద్రీయ సేద్యంపై ఆసక్తి ఉన్నా.. చాలామంది రైతులు సాగుకు ముందుకు రాలేదు. దీంతో డివిజన్ల వారీగా క్షేత్రస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి.. ప్రకృతి సాగు ప్రయోజనాలపై రైతులకు అధికారులు అవగాహన పెంచారు. అదేవిధంగా మార్కెట్ సౌకర్యం పైనా భరోసా లభించటంతో సేంద్రీయ విధానాల్లో పంటల సాగు విజయనగరం జిల్లాలో క్రమంగా విస్తరిస్తోంది. పంట వేసినప్పటి నుంచి దిగుబడి చేతికొచ్చే వరకు అధికారులు పర్యవేక్షిస్తూ.. సలహాలు, సూచనలు ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నారు.
తీయటి పదార్ధం తింటే నోటికే కాదు మనస్సుకు సంతృప్తి ఉంటుంది. తీపి లేకుండా మన జీవితాన్ని ఊహించలేము. ఎంతో ఆరోగ్యంగా ఉండే తీపి బెల్లం తయారు చేసేందుకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. బెల్లం అంటే మన రాష్ట్రంలో పేరు గాంచిన జిల్లాలో అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లా ఈ జిల్లా బెల్లం తిరుమల శ్రీవారికి కూడా ప్రసాదం పంపిన ఘనత ఇక్కడ రైతులది.
Read Also : Sugarcane Cultivation : చెరకు సాగుకు సిద్ధమవుతున్న రైతులు.. ఈ మెళకువలు పాటిస్తే దిగుబడులే దిగుబడులు