Fertilizers and Pest Control : వరిలో ఎరువులు, పురుగుల నివారణ
రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన పంట. దీనిని పలు వాతావరణ పరిస్థితులలో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు రైతులు సిద్దమయ్యారు. సాగునీటి వసతి ఉన్న రైతులు ఇప్పటికే చాలా వరకు వరినాట్లు వేసుకున్నారు.

fertilizers and pest control
Fertilizers and Pest Control : తెలుగు రాష్ట్రాల్లో వరినారుమళ్లు పోసే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి . నేరుగా వరి విత్తే విధానాలు కొన్ని ప్రాంతాల్లో ఆచరణలో వున్నా, చాలామంది రైతులు నారుమడులను పెంచి, నాటే పద్ధతిని ఆచరిస్తున్నారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో రైతులు నార్లు పోసుకున్నారు. మరి కొంత మంది ఇప్పుడికే నాట్లు వేశారు. అయితే ఆరోగ్యవంతమైన నారు అందిరావాలంటే , నారుమడిలో, ప్రధాన పొలంలో పాటించాల్సిన మేలైన యాజమాన్యం పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. లక్ష్మీ ప్రసన్న .
READ ALSO : YS Sharmila: సోనియాగాంధీతో వైఎస్ షర్మిల దంపతులు భేటీ.. కాంగ్రెస్‌లో వైఎస్ఆర్‌టీపీ విలీనంపై చర్చ?
రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన పంట. దీనిని పలు వాతావరణ పరిస్థితులలో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు రైతులు సిద్దమయ్యారు. సాగునీటి వసతి ఉన్న రైతులు ఇప్పటికే చాలా వరకు వరినాట్లు వేసుకున్నారు. కొంత మంది నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే నారుమడులు పోసుకోలేని రైతులు నేరుగా వెదపద్ధతిలో వరిసాగు చేసుకోవచ్చు.
READ ALSO : Making Salt : సముద్రపు నీటితో ఉప్పు తయారీ..
అయితే నారుమడిలో నారు పుష్ఠిగా పెరిగి అందిరావాలంటే.. చీడపీడల పట్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా నారుమడి నుండి ప్రధాన పొలంలో నాటే వరకు ఆశించే చీడపీడల నివారణ.. ఎరువుల యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త, డా. లక్ష్మీ ప్రసన్న.