Neem : వేపలో శిలీంద్ర తెగులు, టీ మస్కిటో కు హోమియోపతి మందు

దీనిని పిచికారీ చేసిన రెండు రోజుల అనంతరం కొక్నీనెల్లా 200 అనే హోమియో ద్రవ రూప మందును తగిన మోతాదులో నీటిలో కలిపి వేపచెట్లపై పిచికారీ చేయాలి.

Neem : వేపలో శిలీంద్ర తెగులు, టీ మస్కిటో కు హోమియోపతి మందు

Neem Tree

Updated On : February 8, 2022 / 6:21 PM IST

Neem : ఇటీవలి కాలంలో వేప చెట్లు ఊహించని విధంగా నిలువునా ఎండి పోతున్నాయి. దీనికి కారణం తెలియక చాలా మంది సతమతమౌతున్నారు. అయితే డై బ్యాక్ అనే శిలీంద్ర సంబంధమైన తెగులుతోపాటు మస్కిటో దోమ కారణంగానే వేపచెట్లు చిగుర్లు మాడిపోవం, చెట్లు ఎండిపోవటం జరుగుతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా వేప ప్రకృతి సేధ్యంలో క్రియాశీలకంగా మారిన నేపధ్యంలో వాటిని కాపాడుకోవాల్సిన తక్షణ అవసరత ఏర్పడింది.

ఈ క్రమంలో వేపచెట్లను రక్షించుకునేందుకు హోమియోపతి మందులు చక్కగా పనిచేస్తాయని రైతు శాస్త్రవేత్తలు , హోమియో నిపుణులు సూచిస్తున్నారు. క్యూప్రమ్ మెట్ 200 ద్రవ రూప హోమియో మందును పిచికారి చేయటం ద్వారా టీ మస్కిటో దోమను నివారించ వచ్చని సూచిస్తున్నారు.

దీనిని పిచికారీ చేసిన రెండు రోజుల అనంతరం కొక్నీనెల్లా 200 అనే హోమియో ద్రవ రూప మందును తగిన మోతాదులో నీటిలో కలిపి వేపచెట్లపై పిచికారీ చేయాలి. అలాగే చెట్టు మొదలు చుట్టూ పాదులా చేసి అందులో పోయాలి. పాదును ముందుగా నీరు కట్టి తరువాత మందు కలిపిన నీటిని పోయాలి. ఒక్కో చెట్టుకు పదిలీటర్ల నీరు , అదే పెద్ద చెట్టైతే 20 లీటర్లు చొప్పున పోయాలి. అవసరమనుకుంటే 20రోజుల తరువాత మరో మారు వాడుకోవాల్సి ఉంటుంది. హోమియోపతి మందును 20 లీటర్ల నీటికి 2.5 మి.ల్లీ లీటర్ల 2.5 మోతాదులో కలిపి పిచికారి చేయాలి.