Potato Cultivation : ఆలుగడ్డ సాగుతో.. అద్భుత ఆదాయం

కొంత మంది రైతులు ముందుగా వేసి, గడ్డను తవ్వుతున్నారు. వచ్చిన గడ్డను హైదరాబాద్ మార్కెట్ లకు తరలిస్తున్నారు. గత ఏడాది కిలో ధర 14 రూపాయల వరకు పలికింది. ప్రస్తుతం కిలో ధర రూ. 22 పలుకుతుందని రైతులు చెబుతున్నారు.

Potato Cultivation : ఆలుగడ్డ సాగుతో.. అద్భుత ఆదాయం

Sweet Potato Cultivation

Updated On : April 21, 2023 / 10:25 PM IST

Potato Cultivation : ఆలుగడ్డ.. మనదేశంలో అత్యధికశాతం మంది రోజు తినే కూరగాయల్లో ఇదొకటి. కానీ ఈ పంట సాగు తెగులు రాష్ట్రాల్లో లేకపోవడం.. ఉత్తరాది రాష్ట్రాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. కానీ ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లాలోని… జహీరాబాద్ ప్రాంతంలోని రైతులు అధికంగా ఆలుగడ్డ సాగుచేస్తూ.. మంచి దిగుబడులను సాధిస్తున్నారు. మార్కెట్ లో కూడా మంచి ధర పలకడంతో లాబాలను పొందుతున్నారు.

READ ALSO : Cucumber : దోససాగు…దిగుబడినిచ్చే విత్తన రకాలు

సంగారెడ్డి జిల్లా, జహిరాబాద్ మండలం, రంజోల్ గ్రామంలో చాలా మంది రైతులు ఆలుగడ్డను సాగుచేస్తూ ఉంటారు. ఈ ప్రాంత భూమిలో తేమ తక్కువగా ఉండి, చలి ఎక్కువగా ఉండటంతో ఆలుగడ్డ దిగుబడి బాగుంటుంది. అంతే కాదు మిగితా పంటలతో పోల్చితే తక్కువ సమయంలోనే చేతికి అందటం.. పెట్టుబడికి మూడింతల లాభం రావడంతో చాలామంది ఆలుగడ్డసాగుకు మొగ్గుచూపుతున్నారు.

అయితే ఈసారి అధిక వర్షాల వల్ల పంట ఆలస్యమైంది. కానీ కొంత మంది రైతులు ముందుగా వేసి, గడ్డను తవ్వుతున్నారు. వచ్చిన గడ్డను హైదరాబాద్ మార్కెట్ లకు తరలిస్తున్నారు. గత ఏడాది కిలో ధర 14 రూపాయల వరకు పలికింది. ప్రస్తుతం కిలో ధర రూ. 22 పలుకుతుందని రైతులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఆలుగడ్డ జనవరి నుండి ఫిబ్రవరి వరకు దిగుబడి వస్తుందని.. ఆ సమయంలో ఉత్తరాధి రాష్ట్రాలనుండి వచ్చే ఆలుగడ్డను అనుమతించవద్దని కోరుతున్నారు.

READ ALSO : Drumsticks Cultivation : మునగసాగులో సస్యరక్షణ చర్యలు

ఆలు సాగు చేస్తే … ఎకరానికి 100 నుంచి 150 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటా ధర రూ.1400 వరకూ ఏడాది పొడవునా ఉంటోంది. ఒక్కోసారి రూ.2 వేలకు వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. ప్రస్తుతం క్వింటా ధర రూ. 2 వేల 200 నడుస్తోంది. ఎకరాకు 120 క్వింటళ్ల దిగుబడి వచ్చినా.. సరాసరి 1400 పలికినా.. పెట్టుబడి పోను రైతుకు ఎకరానికి రూ.లక్ష వరకు నికర ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.